Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి గ్యాంగ్ రేప్, సోషల్ మీడియాలో వీడియో

Webdunia
బుధవారం, 19 జులై 2023 (23:20 IST)
మణిపూర్‌లో దారుణ సంఘటన వెలుగుచూసింది. కొందరు మగాళ్ల గుంపు ఇద్దరు మహిళలను రోడ్డుపై నగ్నంగా ఊరేగించిన భయంకరమైన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేయబడింది. రోడ్డుపై ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగిస్తూ, వారి ప్రైవేట్ భాగాలపై చేతులు వేస్తూ వారిని పొలంలోకి తరలించుకెళ్లారు. అక్కడ ఆ మహిళలపై సామూహిక అత్యాచారం జరిగిందని ఓ గిరిజన సంస్థ ఆరోపించింది. ఈ సంఘటన మే 4న రాష్ట్ర రాజధాని ఇంఫాల్‌కు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాంగ్‌పోక్పి జిల్లాలో జరిగిందని ఆదివాసీ గిరిజన నాయకుల ఫోరమ్ ఒక ప్రకటనలో తెలిపింది.
 
ఈ దారుణ ఘటనకి ముందురోజు షెడ్యూల్డ్ తెగల హోదా కోసం మెయిటీస్ డిమాండ్‌పై మణిపూర్‌లోని లోయ-మెజారిటీ మెయిటీ, కొండ-మెజారిటీ కుకీ తెగ మధ్య ఘర్షణలు చెలరేగాయి. ఈ క్రమంలో ఆ మహిళలపై దారుణం జరిగినట్లు అనుమానిస్తున్నారు. కాగా నిందితులపై సామూహిక అత్యాచారం, హత్య కేసు నమోదు చేసినట్లు మణిపూర్ పోలీసులు ఈరోజు ట్వీట్ చేశారు.
 
"మే 4న ఇద్దరు మహిళలను గుర్తుతెలియని సాయుధ దుండగులు నగ్నంగా ఊరేగించిన వీడియోలకు సంబంధించి, నాంగ్‌పోక్ సెక్మై పోలీస్ స్టేషన్లో అపహరణ, సామూహిక అత్యాచారం, హత్య కేసు నమోదైంది. దర్యాప్తు ప్రారంభమైంది. నిందితులను వీలైనంత త్వరగా పట్టుకునేందుకు పోలీసులు అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తున్నారు’’ అని మణిపూర్ పోలీసులు ట్వీట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kaml hasan: వన్ రూల్ నో లిమిట్స్ అంటూ థగ్ లైఫ్ విడుదల తేదీ పోస్టర్ వచ్చేసింది

నవీన్ చంద్ర, షాలినీ వడ్నికట్టి జంటగా 28°C చిత్రం

సంతాన ప్రాప్తిరస్తు మూవీ నుంచి నాలో ఏదో.. లిరికల్ సాంగ్

నాట్స్ సంస్థ లోగో లోనే భాష, సేవ ఉన్నాయి : సినీ ప్రముఖులు

Nidhhi Agerwal: నేను హీరోతో డేటింగ్ చేయకూడదు.. నిధి అగర్వాల్ చెప్తున్నందేంటి.. నిజమేంటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

తర్వాతి కథనం