Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్త అక్రమ సంబంధం.. దంత మహిళా వైద్యురాలు ఆత్మహత్య ... ఎక్కడ?

ఠాగూర్
సోమవారం, 14 జులై 2025 (21:16 IST)
తెలంగాణ రాష్ట్రంలోని హన్మకొండ జిల్లా హసన్‌పర్తిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. భర్త అక్రమ సంబంధాన్ని భరించలేని ఓ దంత మహిళా వైద్యురాలు బలన్మరణానికి పాల్పడింది. భర్త వివాహేతర సంబంధంతో పాటు అత్తింటివారి వేధింపులతో జీవితంపై విరక్తి చెందిన ఆమె తనువు చాలించింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ములుగు జిల్లా కమలాపూర్ మండలం మంగపేటకు చెందిన డాక్టర్ సృజన్‌తో వరంగల్‌కు చెందిన దంత వైద్యురాలు ప్రత్యూషకు ఎనిమిదేళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. గత కొంతకాలంగా హైదరాబాద్ నగరంలో ఉంటున్నారు. గత యేడాది హాసన్‌పర్తిలోని ఓ వింటేజ్ విల్లాలో స్థిరపడ్డారు. 
 
సృజన్‌కు హన్మకొండకు చెందిన ఒక యువతితో వివాహేతర సంబంధం ఏర్పడటంతో తన కుటుంబాన్ని సొంత కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయడం ప్రారంభించారు. పైగా, భార్యను మానసికంగా, శారీరకంగా వేధించసాగాడు. అత్తమామలు సైతం కుమారుడికే వత్తాసు పలుకు ప్రత్యూషను నిరంతరం వేధించసాగారు. 
 
దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ప్రత్యూష.. ఆదివారం భర్త ఇంట్లో ఉండగానే ఉరేసుకుంది. ఇది గమనించిన భర్త, స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. అయితే, ప్రత్యూష శరీరంపై గాయాలు ఉండటంతో ఆమె తల్లిదండ్రులు హాసన్ పర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కుమార్తెను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని వారు తమ  ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో కేసు విచారణ జరుపుతున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అలనాటి అందాల తార బి.సరోజా దేవి ఇకలేరు... చంద్రబాబు - పవన్ నివాళలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

తర్వాతి కథనం
Show comments