భార్యను హత్య చేసి... తర్వాత ఫేస్‌బుక్ లైవ్‌లో వెల్లడించిన భర్త

ఠాగూర్
బుధవారం, 24 సెప్టెంబరు 2025 (08:50 IST)
కేరళ రాష్ట్రంలోని కొల్లంలో ఓ దారుణం జరిగింది. భార్యను హత్య చేసిన ఓ కిరాతక భర్త... ఆ విషయాన్ని ఫేస్‌బుక్ లైవ్‌లో వెల్లడించారు. మృతురాలిని కొల్లంకు చెందిన శాలిని (39)గా పోలీసులు గుర్తించారు. భార్యను హత్య చేసిన తర్వాత ఆ కిరాతక భర్త ఇసాక్ (42) పునాలూర్ పోలీస్ స్టేషనులో లొంగిపోయాడు. 
 
పోలీసుల కథనం ప్రకారం.. గల్ఫ్ నుంచి తిరిగొచ్చిన ఇసాక్ రబ్బర్ ట్యాప్పర్‌గా పనిచేస్తున్నాడు. శాలిని సమీపంలోని పాఠశాలలో సహాయకురాలిగా పనిచేస్తోంది. వీరికి ఇద్దరు కుమారులు. అయితే శాలినికి, ఇసాక్‌కు మధ్య గత కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో సోమవారం ఉదయం 6:30 గంటలకు బాధితురాలు వంట గది వెనక ఉన్న పైపులైన్ వద్దకు స్నానానికి వెళ్లింది. 
 
ఈ సందర్భంగా ఇసాక్ ఆమెపై కత్తితో దాడిచేశాడు. దీంతో శాలిని మెడ, ఛాతీ, వీపుపై తీవ్ర గాయాలై మరణించింది. అనంతరం ఫేస్‌బుక్‌లో లైవ్ పెట్టి తన భార్యను హత్య చేసినట్లు ఇసాక్ వివరించాడు. శాలిని ఎప్పుడూ తన మాట వినలేదని, తన తల్లితోనే కలిసి నివసించడానికి వెళ్లిందని ఆరోపించాడు. కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జవాన్‌ చిత్రానికి రాష్ట్రపతి నుంచి జాతీయ అవార్డు తీసుకున్న షారుఖ్ ఖాన్‌

Chittibabu: శోభన్ బాబు ఫ్యాన్ కొంటే ఓనర్ వచ్చి తీయించేశాడు : చిట్టిబాబు

OG: ఉత్తరాంధ్రలో దిల్ రాజు కాంబినేష న్ తో OG విడుదల చేస్తున్న రాజేష్ కల్లెపల్లి

శివరాజ్ కుమార్ కుటుంబంతో ప్రత్యేక సమావేశం అయిన మంచు మనోజ్

Allari Naresh: అల్లరి నరేష్ ఆవిష్కరించిన విద్రోహి ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం టీ తాగితే ఏంటి ప్రయోజనాలు?

భారతీయ రోగులలో ఒక కీలక సమస్యగా రెసిస్టంట్ హైపర్‌టెన్షన్: హైదరాబాద్‌ వైద్య నిపుణులు

శనగలు తింటే శరీరానికి అందే పోషకాలు ఏమిటి?

Navratri Snacks: నవరాత్రి స్నాక్స్.. సగ్గుబియ్యం టిక్కా.. అరటి పండ్ల చిప్స్ సింపుల్‌గా..

కామెర్ల వ్యాధితో రోబో శంకర్ కన్నుమూత, ఈ వ్యాధికి కారణాలు, లక్షణాలేమిటి?

తర్వాతి కథనం
Show comments