Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెనాలిలో కాకినాడ యువకుడి కిడ్నాప్ - కరెంట్ షాక్‌తో చిత్రహింసలు

ఠాగూర్
ఆదివారం, 16 ఫిబ్రవరి 2025 (10:17 IST)
గుంటూరు జిల్లా తెనాలిలో కాకినాడ యువకుడు కిడ్నాప్‌ చేసి కరెంట్ షాక్‌తో చిత్రహింసలు పెట్టాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలన పరిశీలిస్తే, హైదరాబాద్ నగరంలో వ్యాపారం చేస్తున్న తెనాలికి చెందిన మణిదీప్ వద్ద కాకినాడ పెద్దాపురానికి చెందిన సతీశ్ అనే యువకుడు గతంలో పనిచేసి మానేశాడు. ఆ సమయంలో అతడికి రెండు నెలల వేతనం మణిదీప్ ఇవ్వాల్సివుంది. దీంతో వాటి కోసం సతీశ్ తరచుకూ మణిదీప్‌కు ఫోన్ చేస్తుండేవాడు. 
 
ఈ క్రమంలో తాజాగా మరోమారు ఫోన్ చేయడంతో విజయవాడ వచ్చి తీసుకెళ్లాలని మణిదీప్ చెప్పాడు. దీంతో అతని మాటలు నిజమని నమ్మి శుక్రవారం సాయంత్రం విజయవాడకు వచ్చిన సతీశ్‌ను మణిదీప్‌తో సహా మరో నలుగురు బలవంతంగా కారులో ఎక్కించుకుని తెనాలి తీసుకెళ్లారు. మార్గమధ్యంలో అతడిపై అందరూ కలిసి దాడిచేశారు. ఆ తర్వాత ఓ ఇంట్లోకి తీసుకెళ్లి కరెట్ షాక్ ఇచ్చి బంధించారు.
 
ఆ తర్వాత సతీశ్‌ను అర్థరాత్రి కారులో ఎక్కించుకుని తీసుకెళతుండా తెనాలి - గుంటూరు వంతెనపై పోలీసులు వాహనం వస్తుండటంతో బాధితుడు కేకలు వేశాడు. దీంతో నిందితులు కారు ఆపడంతో సతీశ్ వెంటనే బయటకుదూకి పోలీసలకు విషయం చెప్పడంతో నిందితుల్లో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకోగా, మిగిలినవారు పారిపోయినట్టు సమాచారం. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

కార్తీక్ ఆర్యన్‌తో గ్లామర్ డోస్ పెంచేసిన శ్రీలీల.. బాలీవుడ్‌లో హిట్టవుతుందా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments