Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడిని పెళ్లాడేందుకు వెళ్లింది.. స్నేహితుడిని వివాహం చేసుకుని ఇంటికొచ్చింది..

ఠాగూర్
ఆదివారం, 31 ఆగస్టు 2025 (09:43 IST)
తన ప్రియుడి కోసం ఇంటి నుంచి చెప్పా పెట్టకుండా పారిపోయిన ఓ యువతి... చివరకు తన స్నేహితుడుని పెళ్లి చేసుకుని ఇంటికి తిరిగివచ్చింది. అయితే, ఆ యువతి తల్లిదండ్రులు మాత్రం ఈ పెళ్లికి ఆమోదం తెలుపకుండా చిన్నపాటి పరీక్ష పెట్టారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్‌లో సినీ ఫక్కీలో జరిగిన ఈ వివాహ తంతును పరిశీలిస్తే, 
 
ఇండోర్‌ నగరంలోని స్థానిక ఎంఐజీ పోలీసు స్టేషన్ పరిధికి చెందిన శ్రద్ధా తివారీ అనే యువతి తన ప్రియుడు సార్థక్‌ను పెళ్లాడేందుకు ఇంటినుంచి పారిపోయింది. అతడి కోసం రైల్వేస్టేషన్‌కు వెళ్లిన ఆ యువతికి ప్రేమికుడు కనిపించలేదు. పైగా, తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని ప్రియుడి నుంచి ఫోన్ వచ్చింది. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన శ్రద్ధా ఇంటికి తిరిగి వెళ్లకుండా రైలు ఎక్కేసింది. ఎక్కడికి వెళ్లాలో తెలియక రత్లామ్ స్టేషనులో దిగింది. అక్కడ కరణ్ అనే వ్యక్తి తారసపడ్డాడు. ఇండోర్‌లో ఆమె చదువుకున్న కళాశాలలో అతడు ఎలక్ట్రిషియన్‌గా పని చేసేవాడు.
 
ఏం జరిగిందని కరణ్ అడగడంతో ఆమె జరిగిందంతా చెప్పింది. ఇంటికి తిరిగి వెళ్లాలని సలహా ఇచ్చినా ఆమె నిరాకరించింది. పెళ్లి చేసుకునేందుకే ఇల్లు వదిలి వచ్చానని, ఒకవేళ అలా జరగకుంటే తాను బతకలేనని చెప్పింది. ఆమెకు సర్దిచెప్పడానికి కరణ్ ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. చివరకు తానే పెళ్లి చేసుకుంటానని ప్రతిపాదించడంతో ఆ యువతి అంగీకరించింది. 
 
ఇద్దరూ పెళ్లి చేసుకొని మందసౌర్‌కు వెళ్లారు. అనంతరం ఆ జంట స్థానిక పోలీసు స్టేషన్‌కు వచ్చి ఈ మేరకు తన వాంగ్మూలం ఇచ్చింది. ఇద్దరినీ పది రోజులు విడివిడిగా ఉంచుతానని అమ్మాయి తండ్రి అనిల్ తివారీ చెప్పారు. అప్పటికీ ఒకరినొకరు ఇష్టపడితే వారి పెళ్లిని అంగీకరిస్తానని అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dhanush: ధనుష్‌ ఇడ్లీ కొట్టుకి యూ సెన్సార్ సర్టిఫికేట్

Tiruveer : ప్రీ వెడ్డింగ్ షో లో తిరువీర్, టీనా శ్రావ్య లపై రొమాంటిక్ సాంగ్

Akshaye Khanna: ప్రశాంత్ వర్మ.. మహాకాళి నుంచి శుక్రాచార్యుడిగా అక్షయ్ ఖన్నా ఫస్ట్ లుక్

అతిపెద్ద పైరసీ రాకెట్‌ను ఛేదించిన హైదరాబాద్ పోలీసులు

Vijay: నిజం బయటకువస్తుంది - త్వరలో బాధితులను కలుస్తానంటున్న విజయ్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని కాలిఫోర్నియా బాదంతో జరుపుకోండి

భారతదేశంలో వైభవోపేతంగా అడుగుపెట్టిన హెచ్ అండ్ ఎం బ్యూటీ కాన్సెప్ట్

కాలేయ క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు ఎలా వుంటాయి?

బాదం పప్పులు రోజుకి ఎన్ని తినాలి? ప్రయోజనాలు ఏమిటి?

భారతదేశంలో లాంచ్ అయిన ఫర్ ఎవర్ మార్క్ డైమండ్ జ్యుయలరి

తర్వాతి కథనం
Show comments