Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడితో మాట్లాడుతోందని అక్కను మట్టుబెట్టిన తమ్ముడు

ఠాగూర్
మంగళవారం, 29 జులై 2025 (08:28 IST)
ప్రియుడుతో మాట్లాడుతోందని అక్కతో గొడవకు దిగిన తమ్ముడు ఆమెను దారుణంగా హత్య చేసిన ఘటన తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం పెంజర్లలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు... పెంజర్లకు చెందిన మేస్త్రీ దేశాల రాఘవేందర్, సునీత దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఓ కుమారుడు ఉన్నారు. 
 
పెద్ద కుమార్తె రుచిత (21) డిగ్రీ పూర్తి చేసి ఎంబీఏ అడ్మిషన్ కోసం ఎదురుచూస్తోంది. అదే గ్రామానికి చెందిన యువకుడితో ప్రేమ వ్యవహారం కొనసాగిస్తోంది. ఈ విషయంపై కుటుంబంలో గొడవలు కూడా జరుగగా, ఆ తర్వాత పెద్దల సమక్షంలో పంచాయతీ వరకు వెళ్లింది. ఇకపై మాట్లాడుకోమని వారు పంచాయతీ పెద్దలకు హమీ ఇచ్చారు. దీంతో సమస్య సద్దుమణిగిందని భావించారు. 
 
అయితే, కొంతకాలం తర్వాత నుంచి మళ్లీ ఫోన్ సంభాషణలు మొదలయ్యాయి. దీనిపై సోదరుడు రోహిత్ (20) రుచితను మందలించసాగాడు. సోమవారం తల్లిదండ్రులు పనులకు వెళ్లగా ఇంట్లో రుచిత, రోహిత్ మాత్రమే ఉన్నారు. ఈ సమయంలో ప్రేమికుడితో అక్క ఫోనులో మాట్లాడటాన్ని గమనించిన రోహిత్ ఆమెతో గొడవకు దిగాడు. ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి గురైన రోహిత్... అక్క మెడకు వైరు బిగించి ఊపిరాడకుండా చేయడంతో రుచిత చనిపోయింది. 
 
ఆ తర్వాత బంధువులకు ఫోన్ చేసి అక్క స్పృహ కోల్పోయిందని సమాచారమిచ్చాడు. వారు వచ్చి పరిశీలించగా ఆమె చనిపోయివుండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments