Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్నాప్ చాట్‌లో పరిచయమైన బాలికను బెదిరించి అత్యాచారం...

వరుణ్
మంగళవారం, 26 మార్చి 2024 (07:56 IST)
సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లలో ఒకటైన స్నాప్ చాట్‌ వేదికగా పరిచయమైన ఓ బాలికను బెదిరించి, బ్లాక్‌మెయిల్ చేసిన ఓ యువకుడు ఆపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ కామాంధుడిపై హైదరాబాద్ నగరంలోని ఎస్ఆర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
అమీర్‌పట - బల్కంపేట రోడ్డులోని సోనాబాయి ఆలయం సమీపంలో ఉంటున్న గణేష్ యాదవ్ (20) అనే యువకుడు అదే ప్రాంతానికి చెందిన తొమ్మిదో తరగతి చదువుతున్న 14 యేళ్ల మైనర్ బాలికతో స్నాప్‌చాట్‌లో పరిచయం పెంచుకున్నాడు. ఆమె ఫోటోలను మార్ఫింగ్ చేసి వీడియోలతో బెదిరించి, బాలిక ఇంట్లో ఎవరూ లేని సమయంలో రెండుసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
దీంతో తీవ్ర మనస్తాపానికి లోనైన ఆ బాలిక.. స్కూల్‌కు వెళ్లకుండా మౌనంగా ఉండసాగింది. కుమార్తె ముభావంగా ఉండటాన్ని గుర్తించిన తల్లి.. బాలికను ప్రశ్నించగా అసలు విషయం వెల్లడించింది. దీంతో స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. 
 
రాజకీయాలు ఇంత క్రూరంగా ఉంటాయా? : ఆర్ఆర్ఆర్ 
 
తనకు లోక్‌సభ టిక్కెట్ ఇవ్వకుండా ఏపీ ముఖ్యమంత్రి జగన్ అడ్డుకున్నారని వైకాపా రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు అలియాస్ ఆర్ఆర్ఆర్ ఆరోపించారు. ఏపీలో భారతీయ జనతా పార్టీ పోటీ చేసే ఆరు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. నిజానికి ఈ ఎన్నికల్లో బీజేపీ తరపున నరసాపురం స్థానం నుంచి ఆర్ఆర్ఆర్ పోటీ చేస్తారంటూ జోరుగా ప్రచారం జరిగింది. ఆయన కూడా బీజేపీ టిక్కెట్ ఇస్తుందన్న గట్టి నమ్మకంతోనే ఉన్నారు. కానీ, బీజేపీ ప్రకటించిన ఆరుగురు అభ్యర్థుల పేర్లలో ఆయన పేరు లేదు. 
 
దీనిపై రఘురామకృష్ణంరాజు స్పందిస్తూ, నరసాపురం సీటు నుంచి తనకు అవకాశం దక్కకుండా సీఎం జగన్ అడ్డుపడ్డారని ఆయన ఆరోపించారు. జగన్ మోహన్ రెడ్డి షాక్ ఇవ్వబోతున్నారని, రఘురామకృష్ణరాజుకు బీజేపీ నుంచి టికెట్ రానివ్వరని ముందే కొందరు చెప్పారన్నారని ఆయన ప్రస్తావించారు. బీజేపీ తరపున సీటు దక్కకపోయినా సార్వత్రిక ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో ఉంటానని రఘురామకృష్ణరాజు తెలిపారు. 
 
తాను రాజకీయాల్లోనే ఉంటానని, జగన్‌కు తగిన గుణపాఠం చెబుతానని మండిపడ్డారు. సీఎం జగన్ అవినీతిపై, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై మొదటి నుంచి దండెత్తిన తనకు అటు బీజేపీ, ఇతర పార్టీల నుంచి అవకాశం లేకుండా చేయడం దారుణమని వ్యాఖ్యానించారు. ఓ బీజేపీ నేత ద్వారా జగన్ సీటు రానివ్వలేదు. జగన్ ప్రభావంతో నరసాపురం స్థానాన్ని తనకు కేటాయించలేదని, కొందరు బీజేపీ నేతలతో జగన్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్న విషయం అందరికీ తెలిసిందేనని, ఓ నేత ద్వారా టికెట్ రాకుండా అడ్డుకోగలిగినట్లు తెలిసిందని ఆయన పేర్కొన్నారు. 
 
నరసాపురం నుంచి పోటీచేస్తానా? ఇంకేదైనా స్థానమా అనేదానికి కాలమే సమాధానం ఇస్తుందని అన్నారు. పనికిమాలిన వైసీపీలో చేరి ప్రజలకు అన్యాయం చేశాననే భావనతో ప్రాణాలకు తెగించి పోరాటం చేశానని పేర్కొన్నారు. తనకు సీటు దక్కకపోయినప్పటికీ జగన్ అనుకున్నది మాత్రం జరగనివ్వబోనని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ చీప్ ట్రిక్స్ పనిచేయబోవని పేర్కొన్నారు. రాజకీయాలు క్రూరంగా ఉంటాయని తెలిసినప్పటికీ ఇప్పుడు ప్రత్యక్ష అనుభవపూర్వకంగా తెలిసివచ్చిందని రఘురామరాజు వ్యాఖ్యానించారు. నరసాపురం టికెట్ రానందుకు తన అభిమానులు మనస్తాపం చెందవద్దని ఆయన సూచించారు. తాను ఎన్నికల్లో పోటీ చేసినా చేయకపోయినా ఎన్డీయే విజయం సాధిస్తుందని, చంద్రబాబు అధికారంలోకి వస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pushpa 2 Kissik Song- ఏడు కోట్లు ఆదా చేసిన శ్రీలీల.. ఎలా?

బరువెక్కుతున్న కేతిక శర్మ హృదయ అందాలు.. కుర్రాళ్లు ఫిదా!

ఎర్రచీర దర్శకుడు సి.హెచ్.సుమన్ బాబు దర్శకత్వంలో సోషియో ఫాంటసీ

బాల్యం నుంచే దేశభక్తి ని అలవరుసుకునేలా అభినవ్ చిత్రం - భీమ‌గాని సుధాక‌ర్ గౌడ్

అజిత్ తో మూవీ తర్వాతే కంగువ 2 చేస్తాం, దీపిక పడుకోన్ నాయిక కాదు : కేఈ జ్ఞానవేల్ రాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

తిరుపతిలో తమ మొదటి స్టోర్‌ను ప్రారంభించిన ప్రముఖ లగ్జరీ ఫర్నిచర్ బ్రాండ్ డురియన్

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

చిల్డ్రన్స్ డే: స్పెషల్ స్ట్రాబెర్రీ చీజ్ కేక్ ఎలా చేయాలంటే?

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడం కొన్ని బాదంపప్పులు తినండి

తర్వాతి కథనం
Show comments