Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడు రాలేదనీ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య.. ఎక్కడ?

Webdunia
గురువారం, 2 నవంబరు 2023 (09:31 IST)
తాను పిలిచినప్పటికీ ప్రియుడు రాకపోవడంతో ఆగ్రహించిన ఓ ప్రియురాలు ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలు ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని కావడం గమనార్హం. ఈ విషాదకర ఘటన హైదరాబాద్ నగరంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
రాజస్థాన్ రాష్ట్ర రాజధాని జైపూర్‌కు చెందిన ఖుష్బు శర్మ(32) అనే మహిళ కేపీహెచ్‌బీ పరిధి వన్‌సిటీలోని ఏ బ్లాక్‌లో ఉంటూ, గూగుల్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తుంది. ఈమెకు ఆన్‌లైన్‌ డేటింగ్‌ యాప్‌లో నెల్లూరుకు చెందిన మనోజ్‌ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. మనోజ్ హైదరాబాద్‌లోని మియాపూర్‌లో వ్యాపారం చేస్తున్నాడు. 
 
ఈ క్రమంలో మనోజ్‌తో ప్రేమలో పడిన ఖుష్బు శర్మ... మంగళవారం ఉదయం మనోజ్‌ను తన వద్దకి రమ్మని కోరగా, తర్వాత వస్తానని చెప్పాడు. ఆ తర్వాత కూడా రాకపోవడంతో కారులో మియాపూర్‌ బయలుదేరింది. మార్గమధ్యలో మనోజ్‌కు ఫోన్‌ చేసి వసంతనగర్‌ కమాన్‌ వద్ద ఉన్నానని, రాకపోతే చచ్చిపోతానని బెదిరించింది. అతను వచ్చేసరికి అపస్మారక స్థితిలో ఉండటంతో ఆసుపత్రికి తరలించాడు. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments