Webdunia - Bharat's app for daily news and videos

Install App

భాగ్యనగరిలో దారుణం... మహిళపై ఇద్దరు మహిళల లైంగిక దాడి...

Webdunia
మంగళవారం, 24 అక్టోబరు 2023 (09:11 IST)
హైదరాబాద్ నగరంలో దారుణం జరిగింది. భర్తతో గొడవపడి బస్టాండ్‌లో నిద్రించిన ఓ మహిళపై ఇద్దరు మహిళలు లైంగికదాడికి పాల్పడ్డారు. మాయమాటలు చెప్పి ఇంటికి తీసుకెళ్లి మత్తు కలిపిన శీతలపానీయం ఇచ్చారు. ఆమె మత్తులోకి జారుకోగానే లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ ఘటన రహ్మత్ నగర్ ప్రాంతంలో వెలుగు చూసింది. ఆపై ఆమె వద్ద నాలుగు తులాల బంగారు గొలుసు, చెవికమ్మలను దోచుకుని పారిపోయారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
రహ్మత్ నగర్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ (38) ఈ నెల 13వ తేదీన భర్తతో గొడవపడి మనస్తాపంతో ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. ఆ రాత్రి యూసుఫ్‌ గూడ బస్టాండ్‌లోనే నిద్రపోయింది. దీన్ని గమనించిన ఇద్దరు మహిళలు.. ఆమెను పలకరించి విషయం అడిగి తెలుసుకున్నారు.
 
ఆపై ఇక్కడ ఉండడం మంచిది కాదని, తమ ఇంట్లో పడుకుని ఉదయం వెళ్లిపోవాలని చెబుతూ బ్రహ్మశంకరనగర‌లోని తమ ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ ఆమెకు శీతలపానీయం ఇచ్చారు. అది తాగిన బాధితురాలు మత్తులోకి జారుకుంది. మత్తులో ఉన్న ఆమెపై వీరిద్దరూ లైంగికదాడికి పాల్పడ్డారు. శరీరమంతా గోళ్లతో రక్కి గాయపరిచారు. తమ కామవాంఛ తీరిన తర్వాత ఆమె మెడలోని నాలుగు తులాల బంగారు గొలుసు, చెవి కమ్మలు లాక్కున్నారు.
 
వారి చెర నుంచి ఎలాగోలా తప్పించుకున్న బాధితురాలు ఇంటికి చేరుకుని భర్తకు చెప్పింది. గాయాలతో బాధపడుతున్న ఆమెను ఆసుపత్రిలో చేర్చిన భర్త అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన బాధితురాలు సోమవారం మరోమారు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అసహజ శృంగారంతోపాటు దోపిడీ, దొంగతనాలకు వారిద్దరూ పాల్పడుతున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఓ మహిళను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. మరో నిందితురాలి కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గుమ్మడికాయ కొట్టిన గేమ్ ఛేంజర్ - ఫ్యాన్స్ ఫిదా

అదే ఫీల్డ్ లో వర్క్ చేయడం ఆనందంగా వుంది : డార్లింగ్ ప్రొడ్యూసర్ చైతన్య రెడ్డి

అల్లు శిరీష్ బడ్డీ సినిమా నుంచి ఫీల్ ఆఫ్ బడ్డీ రిలీజ్

ప్రేక్షకుల మధ్య విజయ్ ఆంటోనీ యాక్షన్ ఫిల్మ్ తుఫాన్ ట్రైలర్ ఇంట్రడక్షన్

మిస్టర్ బచ్చన్ లో రవితేజ, భాగ్యశ్రీ బోర్సే పై సితార్ సాంగ్ షూట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం