ఐదేళ్ల చిన్నారిపై పాశవికంగా దాడి చేసిన ఆయా

ఠాగూర్
సోమవారం, 1 డిశెంబరు 2025 (15:22 IST)
హైదరాబాద్ నగరంలోని షాపూర్ నగర్‌లో ఓ అమానుష ఘటన చోటుచేసుకుంది. నర్సరీ పాఠశాలలో చదువుతున్న ఐదేళ్ల చిన్నారిపై పాఠశాల ఆయా అత్యంత పాశవికంగా దాడి చేసింది. ఈ దారుణాన్ని కొందరు మొబైల్ ఫోనులో చిత్రీకరించి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితురాలిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు... ఒడిశాకు చెందిన సంతోషి, కలియా దంపతులు తమ ఐదేళ్ల కుమార్తె ధరిత్రితో కలిసి కొన్ని నెలల క్రితం నగరానికి వలస వచ్చారు. షాపూర్ నగర్‌లోని పూర్ణిమా స్కూల్లో సంతోషి ఆయాగా పనిచేస్తుండగా, కుమార్తె ధరిత్రి అదే స్కూల్లో నర్సరీ చదువుతోంది. అదే పాఠశాలలో ఆయాగా పనిచేస్తున్న లక్ష్మమ్మ, తల్లిలేని సమయంలో చిన్నారిని కొన్నాళ్లుగా హింసిస్తోంది.
 
శనివారం సాయంత్రం లక్ష్మమ్మ మరోసారి చిన్నారిపై విరుచుకుపడింది. జుట్టు పట్టుకుని తలను నేలకేసి బాదడమేకాకుండా, కిందపడేసి కాలితో తొక్కింది. ఈ ఘటనను పాఠశాల పక్కన ఉన్న ఓ బాలుడు వీడియో తీసి చిన్నారి తల్లిదండ్రులకు ఇచ్చాడు. వారు పాఠశాల యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోవడంతో ఆదివారం జీడిమెట్ల పోలీసులను ఆశ్రయించారు.
 
వీడియో ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితురాలు లక్ష్మమ్మను అెరెస్టు చేశారు. తీవ్రంగా గాయపడిన చిన్నారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. నిందితురాలిపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Achanta : అఖండ 2 నిర్మించడానికి గట్టి పోటీనే ఎదుర్కొన్నాం : రామ్, గోపీచంద్ ఆచంట

Bhumika Chawla: యూత్ డ్రగ్స్ మహమ్మారి బ్యాక్ డ్రాప్ తో యుఫోరియా చిత్రం

Samantha Ruth Prabhu: రాజ్ నిడిమోరును పెళ్లాడిన సమంత రూతు ప్రభు

Harshali Malhotra: ఎనర్జీ కోసం ఉదయం దీనిని తాగమని ఆయన నాకు చెప్పేవారు: హర్షాలి మల్హోత్రా

'మన శంకర వరప్రసాద్ గారు'లో ఆ ఇద్దరు స్టార్ హీరోల స్టెప్పులు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

జుట్టుకు మేలు చేసే ఉల్లిపాయ నూనె.. మసాజ్ చేస్తే అవన్నీ పరార్

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

తర్వాతి కథనం
Show comments