Webdunia - Bharat's app for daily news and videos

Install App

శామిర్‌పేటలో విద్యార్థినిపై హెడ్మాస్టర్ అత్యాచారం...

Webdunia
గురువారం, 30 డిశెంబరు 2021 (09:17 IST)
హైదరాబాద్ నగర శివారు ప్రాంతమైన శామిర్‌పేటలో పవిత్రమైన గురువు స్థానంలో ఉన్న ఓ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కామాంధుడుగా మారిపోయాడు. ముఖానికి మాస్క్ పెట్టుకోకుండా స్కూల్‌కు వచ్చిన ఓ విద్యార్థినిని తన గదికి తీసుకెళ్లి అత్యాచారానికి తెగబడ్డాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు... మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లాలోని శామిర్‌పేటకు చెందిన ఓ విద్యార్థిని (15) తొమ్మిదో తరగతి చదువుతుంది. ఈ నెల 22వ తేదీన పాఠశాలకు వెళ్లిన ఆ విద్యార్థిని ముఖానికి మాస్క్ ధరించలేదు. ఆ సమయంలో ఆ బాలికను చూసిన హెడ్మాస్టర్ తన గదికి రావాలంటూ ఆదేశించాడు. దీంతో భయంతో వణికిపోతూ గదికి వెళ్లిన బాలికపై హెడ్మాస్టర్ లైంగికదాడికి పాల్పడ్డారు. పైగా, ఈ విషయం ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని, టీసీ ఇచ్చి పంపించి వేస్తానని హెచ్చరించడంతో ఆ బాలిక మిన్నకుండిపోయింది. 
 
ఈ క్రమంలో అదే స్కూల్‌లో హెచ్.ఎంగా పని చేసిన ఓ మహిళా ఉపాధ్యాయురాలు బుధవారం ఆ స్కూల్‌కు వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థులంతా ఆ మహిళా ప్రధానోపాధ్యాయురాలిని కలుసుకున్నారు. అపుడు బాధిత బాలిక తనకు జరిగిన అన్యాయాన్ని ఆమెకు చెప్పి బోరున విలపించింది. 
 
ఆ మహిళా హెచ్ఎం.. బాధిత బాలికకు అండగా నిలిచి, పోలీసుల ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు... స్కూల్ హెడ్మాస్టర్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. కేసు దర్యాప్తు జరుపుతున్నారు. బాలికకు వైద్య పరీక్షలు కూడా చేయించాలని నిర్ణయించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్‌‌కు ఏమైంది? ఆస్పత్రిలో వున్నాడా?

భయంగా వుంది, జీవితాంతం నువ్వు నా చేయి పట్టుకుంటావా?: రెండో పెళ్లికి సమంత రెడీ?

మహా కుంభమేళాలో కుటుంబంతో పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్

ప్లాప్ తో సంభందం లేకుండా బిజీ గా సినిమాలు చేస్తున్న భాగ్యశ్రీ బోర్స్

ఇంటెన్స్ మ్యూజికల్ లవ్ స్టోరీగా హోలీ కి దిల్ రూబా తో వస్తున్నా : కిరణ్ అబ్బవరం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వయసు 59, గుర్రంతో పాటు దౌడు తీస్తున్న బాబా రాందేవ్ (video)

అధిక రక్తపోటును సింపుల్‌గా అదుపులోకి తెచ్చే పదార్థాలు

పిల్లలు వ్యాయామం చేయాలంటే.. ఈ చిట్కాలు పాటించండి

Garlic: పరగడుపున వెల్లుల్లిని నమిలి తింటే? చర్మం మెరిసిపోతుంది..

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

తర్వాతి కథనం
Show comments