Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1లో బ్యూటీ స్పా ముసుగులో వ్యభిచారం...

Webdunia
బుధవారం, 5 ఏప్రియల్ 2023 (18:30 IST)
హైదరాబాద్ నగరంలో వ్యభిచార వృత్తి జోరుగానే సాగుతోంది. ఈ వ్యభిచార ముఠాలను పోలీసులు క్రమంగా గుట్టు రట్టు చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ నగరంలో పేరుగాంచి బంజారా హిల్స్ రోడ్ నంబరు 1లోని ఏరోనాటిక్ బ్యూటీ స్పా పేరిట అమ్మాయిలతో వ్యభిచారం చేయిస్తున్న గుట్టును పోలీసులు బహిర్గతం చేశారు. పక్కాసమాచారంతో దాడులు చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు పలువురు అమ్మాయిలను రక్షించి, పలువురు విటులను అరెస్టు చేశారు. 
 
వివిధ ప్రాంతాల నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి ఏరోనాటిక్ బ్యూటీ స్పా పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఈ స్పా‌పై దాడులు చేపట్టి నిర్వాహకులతో సహా 20 మందిని అదుపులోకి తీసుకున్నారు. 
 
వీరిలో 10 మంది మహిళలు కాగా, 10 మంది పురుషులు ఉన్నారు. వీరిని పంజాగుట్ట పోలీసులకు అప్పగించారు. స్పా మాటున అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని పక్కా సమాచారంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమాజంలోని సంఘటనల నేపథ్యంగా యముడు చిత్రం తీశాం : దర్శకుడు

Vijay: విజయ్ దేవరకొండ చిత్రం కింగ్ డమ్ కు టికెట్ల పెంపు పై సందిగ్థ

బ్రాట్ లో యుద్ధమే రానే పాటను సిద్ శ్రీరామ్ అద్భుతంగా పాడారు : డాక్టర్ నరేష్ వికే

Varun Sandesh: వన్ వే టికెట్ టైటిల్ బాగా నచ్చింది : వరుణ్ సందేశ్

Tarun Bhaskar:: సినిమాలకు ఎప్పుడూ హద్దులుండకూడదు : తరుణ్ భాస్కర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments