Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య ఆనందాన్ని దూరం చేయాలని కుమార్తెను గొంతుకోసి చంపేశాడు...

Webdunia
ఆదివారం, 20 ఆగస్టు 2023 (11:21 IST)
భార్యపై ఉన్న కోపంతో కుమార్తె గొంతు కోసి చంపేశాడో కిరాతక తండ్రి. ఈ దారుణం హైదరాబాద్ నగరంలోని బీహెచ్ఎస్ఈఏలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, చంద్రానగర్‌కు చెందిన చంద్రశేఖర్, హిమ అనే దంపతులు ఉన్నారు. వీరికి 12 ఏళ్ల క్రితం వివాహం కాగా, మోక్షజ్ఞ (8) అనే కూతురు ఉంది. 
 
భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తడంతో ఈ దంపతులు గత కొన్ని నెలలుగా వేర్వేరుగా ఉంటున్నారు. ఇద్దరూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు. ఈ క్రమంలో చంద్రశేఖర్ ఇటీవల తన ఉద్యోగాన్ని కోల్పోయాడు. మోక్షజ్ఞ బీహెచ్ఎస్ఈఎల్లో తన తల్లి వద్ద ఉంటోంది. మోక్షజ్ఞ అక్కడే ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతోంది. 
 
ఉద్యోగం కోల్పోయిన తర్వాత తనను భార్య, అత్తమాలు తక్కువ చేసి చూస్తున్నారని భావించాడు. తన ఉద్యోగం పోయిందని.. భార్య మాత్రం సంతోషంగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేసుకుంటోందని అసహనానికి లోనయ్యాడు.
 
ఈ క్రమంలో శుక్రవారం ఉదయం మోక్షజ్ఞ చదువుతున్న పాఠశాలకు చంద్రశేఖర్ వెళ్లాడు. ఎప్పటిలాగా పాపను కారులో తీసుకొని బయటకు వెళ్లారు. కాస్త దూరం వెళ్లిన తర్వాత తన వెంట తెచ్చుకున్న బ్లేడుతో మోక్షజ్ఞను గొంతు కోసి చంపేశాడు. పాప మృతదేహాన్ని కనిపించకుండా చేయాలని కుట్ర పన్నాడు. 
 
ఇందుకోసం అబ్దుల్లాపూర్‌మెట్ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డు వద్దకు వెళ్లాడు. అక్కడ ఎటు వెళ్లాలి.. మృతదేహాన్ని ఎక్కడ పడేయాలనే ఆలోచనతో కారు నడుపుతూ అదుపుతప్పి పెద్దం బర్పేట్ ఓఆర్ఆర్ వద్ద డివైర్‌ను ఢీకొట్టడంతో కారు ఆగిపోయింది.
 
అదేసమయంలో అటువైపు గస్తీలో ఉన్న పోలీసులు ప్రమాదాన్ని గుర్తించి అటువైపు వెళ్లి కారు వెనక సీట్లో పాప మృతదేహాన్ని గుర్తించారు. వెంటనే చంద్రశేఖర్‍ను అదుపులోకి తీసుకొని అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులకు అప్పగించారు. పోలీసులు ప్రశ్నించడంతో.. తన భార్య ఆనందాన్ని దూరం చేసేందుకే కుమార్తెను హత్య చేసినట్లు చంద్రశేఖర్ అంగీకరించినట్లు తెలుస్తోంది. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nagarjuna: పూరీ జగన్నాథ్, నాగార్జున చిత్రం షురు - తాజా న్యూస్

Priyanka: ప్రియాంక చోప్రా ను ఒంటరిగా రమ్మన్నాడు : ప్రియాంక తల్లి ఆరోపణ

Ketika Sharma: నితిన్.. రాబిన్‌హుడ్‌లో కేతిక శర్మను ప్రజెంట్ చేస్తూ స్పెషల్ సాంగ్

పొయెటిక్ మూవీ కాలమేగా కరిగింది విడుదల కాబోతుంది

శ్రీకాంత్ ఓదెల కథతో Al అమీనా జరియా రుక్సానా- గులాబీ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లంతో 5 అద్భుత ప్రయోజనాలు, ఏంటవి?

వైజాగ్‌ను ప్రకాశవంతంగా మార్చిన బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్

కాలిఫోర్నియా బాదంతో ఈ హోలీని ఆరోగ్యకరంగా, ప్రత్యేకంగా చేసుకోండి

ICE Apples: వేసవి కాలం తాటి ముంజలు.. మహిళల్లో ఆ సమస్యలుండవ్.. ఏంటవి?

Summer: వేసవిలో పిల్లలను రక్షించడం ఎలా..? మసాలా ఫుడ్, ఫ్రిజ్ నీరు వద్దు..

తర్వాతి కథనం
Show comments