జూనియర్ ఆర్టిస్ట్ హత్య.. చెట్టుకు కట్టేసి.. కత్తితో పొడిచి.. పీక కోసి.. మాజీ ప్రియుడి దారుణం

Webdunia
ఆదివారం, 10 సెప్టెంబరు 2023 (10:21 IST)
తాను ప్రేమించిన యువతితో ఓ జూనియర్ ఆర్టిస్ట్ ఒకరు సన్నిహితంగా ఉండటాన్ని మాజీ ప్రియుడు జీర్ణించుకోలేక పోయాడు. దీంతో తన ముగ్గురు స్నేహితులతో కలిసి దారుణానికి పాల్పడ్డాడు. చెట్టుకు కట్టేసి కత్తితో పొడిచి ఆపై పీక కోసం చంపేశాడు. హైదరాబాద్ నగరంలో వెలుగు చూసిన ఈ దారుణ హత్య వివరాలను పరిశీలిస్తే, 
 
పాలమూరు జిల్లా సంకిస గ్రామానికి చెందిన కె.కార్తీక్‌(18) హైదరాబాద్‌లో జూనియర్‌ ఆర్టిస్ట్‌గా పని చేసేవాడు. గత నెల 13 నుంచి అతడి ఆచూకీ లేకపోవడంతో 16న సోదరుడు శంకర్‌ జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీ టీవీ ఫుటేజీ, సెల్‌ఫోన్‌ సిగ్నళ్ల ఆధారంగా నలుగురు యువకులను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా కార్తీక్‌ను హత్య చేసినట్లు తెలిపారు.
 
విజయనగరం జిల్లా గొర్ల మండలం రాగోలుకు చెందిన టి.సాయి(20) హైదరాబాద్‌లో ఉంటూ యూట్యూబర్‌గా చేసేవాడు. అతనికి జూనియర్‌ ఆర్టిస్ట్‌ అయిన ఓ యువతి(19)తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. కొన్నాళ్లకు అతడి ప్రవర్తన నచ్చక ఆమె దూరం పెట్టింది. ఈ క్రమంలో ఆ యువతికి కార్తీక్‌ దగ్గరయ్యాడు. 
 
గత నెలలో ఇద్దరూ కలసి యూసుఫ్‌గూడలోని కార్తీక్‌ సోదరుడు శంకర్‌ గదికి వెళ్లి మూడు రోజులు అక్కడే ఉన్నారు. ఈ విషయం తెలిసి సాయి తట్టుకోలేకపోయాడు. అక్కడికి వెళ్లి కార్తీక్‌తో గొడవపడ్డాడు. అనంతరం అతడి అడ్డు తొలగిస్తేనే తన ప్రేయసి దక్కుతుందని భావించాడు. స్నేహితులైన విజయనగరం జిల్లాకు చెందిన కె.సురేష్‌(22), ఎం.రఘు(19), శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎన్‌.జగదీశ్‌(20) సహాయంతో హత్యకు పథకం వేశాడు. 
 
గత నెల 13న రెండు ద్విచక్రవాహనాలపై కార్తీక్‌ గదికి వెళ్లారు. ఆ యువతి దుస్తులు కొన్ని తమ గదిలో ఉన్నాయని, వాటిని తీసుకెళ్లాలని నమ్మించారు. ద్విచక్రవాహనంపై ఎక్కించుకొని ఓల్డ్‌బోయినపల్లి పాత విమానాశ్రయం మార్గంలోని అటవీ ప్రాంతం వైపు తీసుకెళ్లారు. మార్గం మధ్యలో కార్తీక్‌ను ద్విచక్రవాహనంపై నుంచి కింద పడేసి దాడి చేశారు. అనంతరం చెట్టుకు కట్టేసి తమ వెంట తెచ్చుకున్న కత్తితో పక్కటెముకల్లో పొడిచారు. అది వంకర పోవడంతో బాధితుడిని బోర్లా పడేసి పీకకోశారు. బండరాయితో తలపై కొట్టారు. చనిపోయాడని నిర్ధరించుకున్నాక నలుగురూ వెళ్లిపోయారు.
 
హత్యానంతరం ముగ్గురు నిందితులు సొంతూళ్లకు వెళ్లిపోగా.. సురేష్‌ మాత్రం మృతుడి సెల్‌ఫోన్‌ తీసుకొని నగరంలోనే ఉండిపోయాడు. పోలీసుల దర్యాప్తులో యూసుఫ్‌గూడలో జరిగిన గొడవ తాలూకు ఆధారాలు లభించాయి. కొద్దిరోజుల తర్వాత సురేష్‌ తన వద్ద ఉన్న కార్తీక్‌ సెల్‌ఫోన్‌ ఆన్‌ చేయడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే అతని ఆచూకీ తెలుసుకొని అదుపులోకి తీసుకోవడంతో వ్యవహారం బయటపడింది. నిందితులు సాయి, రఘు, జగదీశ్‌లను కూడా అరెస్టు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nayanatara: చిరంజీవి, నయనతార లపై రెండవ సింగిల్ శశిరేఖ లిరికల్ రాబోతుంది

Allu Arjun : కున్రిన్ పేరుతో జపనీస్ థియేటర్లలోకి అల్లు అర్జున్... పుష్ప 2

Arnold : అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీమియర్‌ చూసి అర్నాల్డ్ ష్వార్జెనెగర్ ప్రశంస

Chiranjeevi: విక్టరీ వెంకటేష్ ఎనర్గి ప్రతి క్షణం ఆనందం కలిగించింది : చిరంజీవి

ఫిబ్రవరిలో విజయ్ దేవరకొండ - రష్మిక పెళ్లి - వార్తలు తోసిపుచ్చలేనంటున్న 'పుష్ప' బ్యూటీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments