Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్ దారుణం : భార్య ఉరి వేసుకుంటే ఆపకుండా వీడియోను తీసిన భర్త...

Webdunia
బుధవారం, 13 డిశెంబరు 2023 (12:43 IST)
హైదరాబాద్ దారుణం జరిగింది. భార్య ఉరివేసుకుంటే ఆపాల్సిన భర్త.. వీడియో తీశాడు. తాగుడు అలవాటు మానుకోకుంటే చనిపోతానని భార్య బెదిరించి, మెడకు ఉరితాడు బిగించుకుని, ఉరేసుకుని ప్రయత్నించింది. దీన్ని ఆపాల్సిన భర్త వీడియో తీస్తూ ఉండిపోయాడు. మద్యం మత్తులో భర్త ఈ దారుణానికి పాల్పడింది. దీంతో భర్త కళ్ల ముందే తనువు చాలించింది. కళ్ల ముందే చనిపోవడం, తండ్రి జైలుకెళ్ళడంతో పిల్లలు అనాథలుగా మారారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
నగరంలోని మురాద్ నగర్ సయ్యద్ అలీగూడలో రసూల్, ఆర్షియా బేగం దంపతులు నిరాసం ఉంటున్నారు. ఐదేళ్ళ క్రితం వీరికి వివాహం జరిగింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. రసూల్‌కు అప్పటికే వివాహం అయినప్పటికీ విషయం దాచి ఆర్షియాను పెళ్లి చేసుకోన్నాడు. ఈ మోసానికి తోడు నిత్యం తాగుతూ గొడవపడుతుండటంతో ఆర్షియా విసిగిపోయింది. 
 
తాగుడు మానేయాలంటూ ఆర్షియా తరచూ భర్తను పోరేది. ఈ విషయంపై భార్యాభర్తల మధ్య నిత్యం గొడవలు జరుగుతూనే ఉన్నాయని స్థానికులు చెప్పారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి కూడా రసూల్, ఆర్షియా గొడవపడ్డారు. భర్తీ తీరుతో విసిగిపోయిన ఆర్షియా, మద్యం మానేయకుంటే ఉరి వేసుకుంటానని బెదిరించింది. ఇలాగైనా భర్త తాగుడు మానేస్తాడని ఆశపడింది. అయితే, అప్పటికీ మద్యం మత్తులో ఉన్న రసూల్‌ భార్య మాటలను లెక్క చేయలేదు. పైపెచ్చు.. రెచ్చగొట్టినట్టు మాట్లాడుతుండటంతో ఆర్షియా విరక్తి చెందింది.
 
భర్త కళ్ల ముందే ఫ్యాన్‌కు చున్నీ బిగించి మెడకు తలిగించుకుంది. అయినా రసూల్ ఆపకపోగా తన ఫోనులో ఇదంతా రికార్డు చేశాడు. దీంతో భర్త కళ్ళెదురుగానే గిలగిలా కొట్టుకుంటూ ఆర్షియా ప్రాణాలు విడిచాడు. ఆర్షియా తనను బెదిరించడానికే చేస్తోందని వీడియో తీశానని, నిజంగా చనిపోతుందని అనుకోలేదంటూ రసూలు పోలీసులు ముందు వాపోయాడు. అయితే, ఆర్షియా ఆత్మహత్యకు పాల్పడుతున్నా ఆపన్నందుకు రసూల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఆత్మహత్య ప్రేరేపించడం నేరమేనని తేల్చి చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

ఆనంది, వరలక్ష్మిశరత్‌కుమార్ థ్రిల్లర్ శివంగి ఆహా లో స్ట్రీమింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments