Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్థిక మోసం కేసులో పద్మశ్రీ అవార్డు గ్రహీత అరెస్టు!! దేశ చరిత్రలోనే తొలిసారి!!

వరుణ్
బుధవారం, 7 ఆగస్టు 2024 (10:02 IST)
ఆర్థిక మోసం కేసులో పద్మశ్రీ అవార్డు గ్రహీత సుందర్ సీ మీనన్‌ను పోలీులు అరెస్టు చేశారు. ఈ కేసులో ఆయనకు కోర్టు రిమాండ్ కూడా విధించింది. దీంతో ఈ పద్మశ్రీ అవార్డు గ్రహీతను పోలీసులు జైలుకు తరలించారు. మోసం కేసులో ఆయనపై మొత్తం 18 సెక్షన్ల కింద ఓ కేరళకు చెందిన ఓ వ్యాపార వేత్తను పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపడం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. 
 
సాధారణంగా వ్యాపారవేత్తలు కొందరు ఆర్థక నేరాల కేసుల్లో అరెస్టు అవ్వడం, ఆ తర్వాత బెయిల్ పై విడుదల కావడం పెద్ద విషయమేమీ కాదు. కానీ కేరళకు చెందిన ఈ వ్యాపారవేత్త ఆర్ధిక మోసం కేసులో ఆరోపణలు ఎదుర్కోవడం, కోర్డు రిమాండ్ విధించడం హాట్ టాపిక్ అయ్యింది. అదీ ఎందుకు అంటే .. అరెస్టు అయిన వ్యాపారవేత్త పద్మశ్రీ అవార్డు గ్రహీత కావడం. 2016లో పద్మశ్రీ అవార్డు అందుకున్న వ్యాపార వేత్త సుందర్ సీ మీనన్ పలు సంస్థలకు డైరెక్టర్‌గా వ్యహరిస్తుంటారు.
 
అయితే సుందర్ సీ మీనన్, మరి కొందరు తమ సంస్థల పేరుపై 62 మందికిపైగా ఇన్వెస్టర్‌ల నుంచి రూ.7.78 కోట్ల డిపాజిట్లు తీసుకుని, స్కీమ్ మెచ్యూరిటీ వ్యవధి తర్వాత డబ్బులు చెల్లించకుండా మోసం చేశారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై వివిధ సెక్షన్‌ల కింద 18 కేసులు నమోదు చేసినట్లుగా పోలీసులు తెలిపారు. కేరళ క్రైమ్ బ్రాంచ్ అధికారులు కేసు దర్యాప్తు క్రమంలో భాగంగా సుందర్ సీ మీనన్‌ను అరెస్టు చేశారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్య 2, ఆదిత్య 369 సినిమాలకు అంతక్రేజ్ దక్కలేదా?

సీతారాములు, రావణుడు అనే కాన్సెప్ట్‌తో కౌసల్య తనయ రాఘవ సిద్ధం

మరో వ్యక్తితో శృంగారం కోసం భర్తను మర్డర్ చేసే రోజులొచ్చాయి, నీనా గుప్తాకి రివర్స్ కామెంట్స్

Charmi: విజయ్ సేతుపతి, పూరి జగన్నాధ్ చిత్రం టాకీ పార్ట్ సిద్ధం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న అరి’సినిమా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments