బీమా సొమ్ముకోసం పాము కాటుతో అమ్మమ్మను చంపేసిన కుమారుడు.. ఎక్కడ?

వరుణ్
ఆదివారం, 25 ఫిబ్రవరి 2024 (10:41 IST)
బీమా సొమ్ము కోసం ఓ వ్యక్తి తన అమ్మమ్మను పక్కా ప్రణాళికతో హత్య చేశాడు. ఎవరికీ అనుమానం రాకుండా కుట్ర పన్ని పాముకాటుతో హత్య చేశాడు. షాకింగ్‌‍కు గురిచేస్తున్న ఈ ఘటన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో వెలుగు చూసింది. రాష్ట్రంలోని కాంకేర్ జిల్లాలోని బాందే పోలీస్ స్టేషన్ పరిధిలో రాణి పఠారియా అనే మహిళ 8 నెలల క్రితం పాము కాటుతో చనిపోయింది. అయితే రూ. కోటి బీమా సొమ్ము కోసం మనవడే ఈ దారుణానికి పాల్పడ్డాడని తాజాగా బయటపడింది. కోటీశ్వరుడు కావాలనే దురాశతో ఈ దారుణానికి ఒడిగట్టాడని తేలింది.
 
నిందితుడు ఆకాశ్ ఓ పాములు పట్టే వ్యక్తికి రూ.30 వేలు సుఫారీ ఇచ్చి పాముకాటుతో చంపించాడని పోలీసులు గుర్తించారు. మహిళ మరణ ఘటనపై కేసు నమోదు కావడంతో దర్యాప్తు చేస్తున్న పోలీసులకు నిందితుడు ఆకాశ్ ప్రవర్తనపై అనుమానం వచ్చింది. అదేసమయంలో మహిళ మరణం సాధారణ పాముకాటు మాదిరిగా లేదని పోలీసులు గుర్తించారు. అందుకు సంబంధించిన కొన్ని ఆధారాలను కూడా సేకరించారు. దీంతో తమదైన రీతిలో విచారణ చేయడంతో నిందితుడు ఆకాశ్ నేరాన్ని అంగీకరించాడు. బీమా సొమ్ము కోసమే ఈ పన్నాగం పన్నినట్టు వెల్లడించాడు.
 
రాత్రికిరాత్రి కోటీశ్వరుడిని కావాలనే ఆశతో తొలుత బీమా చేయించి పథకం ప్రకారం కొన్నాళ్ల తర్వాత హత్య చేయించినట్టు తెలిపాడు. ఈ హత్యలో నిందితుడితో పాటు బీమా ఏజెంట్ పాత్ర కూడా ఉందని పోలీసులు తేల్చారు. ప్రధాన నిందితుడు ఆకాశ్, బీమా ఏజెంట్, పాముల పట్టే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. కాగా అమ్మమ్మ చనిపోయాక నిందితుడు రూ.కోటి బీమా సొమ్ము అందుకున్నాడని పోలీసులు వివరించారు. అతడి నుంచి రూ.10 లక్షల నగదు, కొన్ని నగలు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు వివరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కౌబాయ్ చిత్రంలో నటిస్తానని ఊహించలేదు : చిరంజీవి

కొదమసింహం.. నాకు, రామ్ చరణ్ కు ఫేవరేట్ మూవీ - మెగాస్టార్ చిరంజీవి

జీవి ప్రకాష్ లాంచ్ చేసిన సుడిగాలి సుధీర్, దివ్యభారతి.. G.O.A.T నుంచి లవ్ సాంగ్

Kalyani Priyadarshan : కళ్యాణి ప్రియదర్శన్ ప్రధానపాత్రలో చిత్రం చెన్నైలో ప్రారంభం

ఓపిక, సహనం, జ్ఞానం, తెగింపు, పోరాటం అనేవి మ్యూజిక్ డైరెక్టర్ కు అర్హతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments