Webdunia - Bharat's app for daily news and videos

Install App

బహిర్భూమికి వెళ్లిన బాలింతపై సామూహిక అత్యాచారం

Webdunia
మంగళవారం, 10 మే 2022 (09:45 IST)
ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లాలో మరో దారుణం దారుణం జరిగింది. బహిర్భూమికి వెళ్లిన ఓ బాలింతపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన దుండగులు ఆపై బండరాయితో మోది దారుణంగా హత్యచేశారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని కనగానపల్లి మండలానికి చెందిన మహిళకు ఏడేళ్ల క్రితం వివాహమైంది. ఏడు నెలల క్రితం ఆమె ఓ బాలుడికి జన్మినిచ్చింది. పది రోజుల క్రితం కుంటుంబ నియంత్రణ ఆపరేషన్‌ చేయించుకుంది. 
 
ఈ క్రమంలో సోమవారం ఉదయం తోడికోడలకు అప్పగించి బహిర్భూమికి వెళ్లింది. అప్పటికే అక్కడ కాపుకాసిన నిందితులు ఆమెపై దాడికి దిగారు. అత్యాచారం చేసి ఆపై బండరాయితో మోది హత్య చేశారు. 
 
బహిర్భూమికి వెళ్లిన ఉదయం 10 గంటలు అవుతున్నా ఇంటికి రాకపోవడంతో అనుమానించిన కుటుంబ సభ్యులు గాలించగా ఊరిబయట విగతజీవిగా కనిపించింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. బాధితురాలిని ముఖాన్ని బండరాయితో కొట్టి ఛిద్రం చేశారు. 
 
సమీపంలోని బావి వద్ద ఉన్న బండరాళ్లను తెచ్చి ఆమెను హత్య చేసినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్థారించారు. ముందస్తు పథకంలో భాగంగానే గ్రామానికి చెందిన కొందరు ఆమెను ఊరి బయటకు పిలిపించి హత్య చేసినట్టు అనుమానిస్తున్నారు. బంధువుల్లోనే కొందరిపై ఆమె కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 
 
హత్యకు ముందు ఆమెపై సామూహిక అత్యాచారం చేసి ఉంటారని అనుమానిస్తున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, నలుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నెట్‌ఫ్లిక్స్ సంస్థపై ధనుష్ కేసు.. మద్రాస్ హైకోర్టులో పిటిషన్

వీకెండ్ సినిమా మొదటి షెడ్యూల్ చీరాల లో ప్రారంభం

త్రిగుణ్ కెరీర్ కు టర్నింగ్‌ పాయింట్‌ కావాలి : అల్లరి నరేశ్

నా ద్రుష్టిలో` డాన్స్ కింగ్ అల్లు అర్జున్ - పుష్ప 2 సాంగ్ కు నో ఫీజ్ : శ్రీలీల స్టేట్ మెంట్

చివరి రోజు.. చివరి షాట్... ఎంత అద్భుతమైన ప్రయాణం : అల్లు అర్జున్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments