Webdunia - Bharat's app for daily news and videos

Install App

తేయాకు అనుకుని.. విచికారీ మందుతో టీ తయారీ... ఐదుగురి మృతి

Webdunia
శుక్రవారం, 28 అక్టోబరు 2022 (09:57 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మొయిన్‌పురిలోని నాగ్లాలో ఓ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. టీపొడి అనుకుని పిచికారి మందుతో ఓ మహిళ టీ తయారు చేసింది. ఈ టీని సేవించిన కుటుంబ సభ్యుల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయాడు. మృతుల్లో ఆ మహిళ భర్త, ఇద్దరు కుమారులు, మామ, పొరుగింటి మహిళ ఉన్నారు. మృతులను శివానందన్ (35), ఈయన కుమారుడు శివంగ్ (6), దివ్యాన్ష్ (5), మామ రవీంద్ర సింగ్ (55), పొరుగింటి వ్యక్తి సోబ్రామ్ (45)లు ఉన్నారు. 
 
నాగ్లా కన్వై గ్రామానికి చెందిన ఓ మహిళ టీ కాస్తున్న సమయంలో వరిపంటలో పిచికారీ చేసే మందును టీ పొడిగా భావించి పాలలో కలిపి టీ తయారు చేసినట్టుగా పోలీసులు నిర్ధారించారు. పాలలో కలిపిన విచికారీ మందు విషపూరితం కావడంతో అది తాగిన వారు మరణించినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పోలీసులు వెల్లడించారు. దీనిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. తాను చేసిన పనికి ఐదుగురు ప్రాణాలు కోల్పోవడంతో ఆ మహిళ బోరున విలపిస్తుంది. ఆమెను ఓదార్చడం ఎవరితరం కావడం లేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Prakash : రిలేషన్, ఎమోషన్స్‌, వినోదం కలయికలో చెరసాల సిద్ధం

Sumaya Reddy: గుడిలో కన్నా హాస్పిటల్‌లో ప్రార్థనలే ఎక్కువ.. అంటూ ఆసక్తిగా డియర్ ఉమ టీజర్

పెద్ది సినిమా గేమ్ ఛేంజర్ కాబోతోంది.. రామ్ గోపాల్ వర్మ కితాబు

అది అభయారణ్యం కాదు.. సిటీకి జీవం పోసే పర్యావరణ వ్యవస్థ : ఊర్వశి రౌతేలా

Los Angeles: హాలీవుడ్ స్థాయిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా - లాస్ ఏంజెల్స్ టెక్నికల్ టీమ్ తో చర్చలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

తర్వాతి కథనం
Show comments