Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుమార్తె పాలిత కన్నతండ్రే కాలయముడు.. కరెంట్ షాక్‌తో చంపేశాడు..

Webdunia
సోమవారం, 27 మార్చి 2023 (09:01 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ దారుణం జరిగింది. కుమార్తె పాలిట కన్నతండ్రే కాలయముడయ్యాడు. కుమార్తెకు కరెంట్ షాక్‌ ఇచ్చి చంపేశాడు. ఆ తర్వాత అనారోగ్యంతో చనిపోయిందంటూ నాటకమాడి, అందర్నీ నమ్మించి హుటాహుటిన అంత్యక్రియలు కూడా పూర్తి చేశారు. చివరకు పోలీసులకు చిక్కి జైలు ఊచలు లెక్కిస్తున్నాడు. ఈ దారుణం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్ రాజ్ జిల్లా కర్చన పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని కర్చన సమీప హిందూబేలా గ్రామవాసి లల్లన్‌కు ఇద్దరు కుమార్తెలు. పెద్దకుమార్తె చాందినీ రెండు నెలల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయింది. కుటుంబసభ్యులు వెదికి ఆమెను ఇంటికి తీసుకువచ్చారు. 20 రోజుల క్రితం చాందినీ తన చెల్లి ఆసియాతో కలిసి మళ్లీ ఇంటి నుంచి పారిపోయింది. ఈసారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
అక్కాచెల్లెళ్లు ఇద్దరూ ముంబైలో ఉన్నట్లు తెలుసుకొని.. ఇంటికి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో చాందినీ ఓ యువకుడితో ప్రేమలో ఉందని తండ్రికి తెలిసింది. దీన్ని జీర్ణించుకోలేని లల్లన్‌.. ఆమెను గదిలో బంధించి చితకబాదాడు. ఆ దెబ్బలకు తట్టుకోలేక చాందినీ ప్రాణాలు కోల్పోయింది. 
 
ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని చిన్నకుమార్తె ఆసియాను తండ్రి బెదిరించాడు. విద్యుదాఘాతం సోకి చాందినీ చనిపోయిందని గ్రామస్థులను నమ్మించి శ్మశానంలో పూడ్చిపెట్టాడు. సోదరి మరణాన్ని జీర్ణించుకోలేని ఆసియా.. జరిగిన విషయాన్ని గ్రామస్థులకు చెప్పేయడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు కేసు నమోదు చేసి లల్లన్‌ను అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments