Webdunia - Bharat's app for daily news and videos

Install App

లేడీ డాక్టర్‌ను పెళ్ళి పేరుతో నమ్మించి హోటల్‌కు పిలుపు... కోరిక తీర్చుకున్నాక పెళ్లికి నిరాకరణ

ఠాగూర్
బుధవారం, 21 మే 2025 (11:25 IST)
ఓ మహిళా వైద్యురాలు అత్యాచారానికి గురయ్యారు. పెళ్లి పేరుతో నమ్మించి హోటల్‌కు పిలిపించిన ఓ కామాంధుడు.. తన కోరిక తీర్చుకున్నాక పెళ్లికి నిరాకరించాడు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోకి బంజారాహిల్స్ ప్రాంతంలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే,
 
హైదరాబాద్ నగరంలోని నిలోఫర్ ఆస్పత్రిలో ఓ మహిళ వైద్యురాలిగా పనిచేస్తుంది. ఆమెకు పాలమూరు ప్రభుత్వ ఆస్పత్రిలో పని చేసే వైద్యుడు డాక్టర్ స్వామితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కొంతకాలానికి పెళ్ళి ప్రస్తావన వరకు దారితీసింది. ఈ క్రమంలో, ఈ యేడాది జనవరి నెలలో బాధితురాలిని పెళ్లి చేసుకుంటానని డాక్టర్ స్వామి నమ్మించాడు.
 
ఆ తర్వాత సదరు వైద్యురాలిని హైదరాబాద్ బంజారా హిల్స్‌లో ఉన్న ఓ హోటల్‌కు పిలిపించి, మాయమాటలు చెప్పి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత తాను పెళ్లి చేసుకోని తెగేసి చెప్పాడు. దీంతో పెళ్లి పేరుతో తనను మోసం చేసి, లైంగిక దాడికి పాల్పడ్డాడని గ్రహించిన మహిళా వైద్యురాలు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. 
 
ఆ తర్వాత తనకు జరిగిన అన్యాయంపై ఆమె బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదుచేసింది. డాక్టర్ స్వామి తనను పెళ్ళి పేరుతో నమ్మించి లైంగికదాడికి పాల్పడ్డాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంంది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు డాక్టర్ స్వామిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రమ్యశ్రీ భూమి కబ్జా ఆమెపై రియల్టర్ శ్రీదర్ రావు అనుచరులు దాడి

Nitin: నితిన్ తమ్ముడు నుంచి లయ పై జై బగళాముఖీ.. సాంగ్

అహాన్, అనీత్‌ల కెమిస్ట్రీని చాటేలా సాచెట్-పరంపర జంట పాట హైలైట్

సమ్మతమే మూవీ ఫేమ్ డైరెక్టర్ గోపీనాథ్ రెడ్డి కొత్త సినిమా

విష్ణు కన్నప్ప కథ చెప్పాక రీసెర్చ్ చేశా; శ్రీకాళహస్తి అర్చకులు మెచ్చుకున్నారు : ముఖేష్ కుమార్ సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

ఓరల్ యాంటీ-డయాబెటిక్ మందులను పంపిణీకి అబాట్- ఎంఎస్‌డి వ్యూహాత్మక భాగస్వామ్యం

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

తర్వాతి కథనం