ఐబొమ్మ వెబ్‌సైట్ - బప్పం టివీలు మూసివేత - యజమాని అరెస్టు

ఠాగూర్
ఆదివారం, 16 నవంబరు 2025 (09:56 IST)
పైరసీ సినిమాలకు కేంద్ర బిందువుగా ఉన్న ఐబొమ్మ, బప్పం టీవీ వెబ్‌సైట్లను సైబర్‌ క్రైమ్‌ పోలీసులు మూసివేయించారు. శనివారం అరెస్టయిన ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి చేతులతోనే వాటిని మూసివేయించారు. వెబ్‌ లాగిన్స్‌, సర్వర్‌ వివరాలతో మూసివేశారు. 
 
'నా వద్ద కోట్ల మంది డేటా ఉంది. ఈ వెబ్‌సైట్‌ మీద ఫోకస్‌ చేయటం ఆపండి' అంటూ గతంలో అతడు పోలీసులకు సవాల్‌ విసిరాడు. ఈ సవాల్‌కు సంబందించిన ఓ లేఖ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. ఈ సవాల్‌ను స్వీకరించిన పోలీసులు అతని కోసం వేట కొనసాగించారు. ఈ నేపథ్యంలో ఆ సవాల్‌ను స్వీకరించి ఇమ్మడి రవితోనే పోలీసులు ఆయా వెబ్‌సైట్లను క్లోజ్‌ చేయించడం గమనార్హం. 
 
ఇమ్మడి రవి వద్ద స్వాధీనం చేసుకున్న వందల హార్డ్‌ డిస్క్‌లను పోలీసులు విశ్లేషిస్తున్నారు. నిందితుడి బ్యాంక్‌ ఖాతాల వివరాలను పరిశీలిస్తున్నారు. ఇమ్మడి రవిని కస్టడీకి తీసుకుని మరిన్ని వివరాలు సేకరించాలని భావిస్తున్నారు. సోమవారం నాంపల్లి కోర్టులో కస్టడీ పిటిషన్‌ను పోలీసులు దాఖలు చేయనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

మహేష్ బాబు రాముడిగా కనిపిస్తారు: రాజమౌళి బిగ్ అప్డేట్

శ్రీదేవి అపల్లా, ఫెమినా జార్జ్, విజయ్ బుల్గానిన్ కాంబోలో ద్విభాషా చిత్రం

Rajamouli: రాజమౌళి, మహేష్ బాబు చిత్రం వారణాసి ఒక్క పార్ట్ నా?

అరుళ్ నిథి, మమతా మోహన్‌దాస్ ల మై డియర్ సిస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments