Webdunia - Bharat's app for daily news and videos

Install App

డబ్బుల కోసం వేధిస్తున్న కుమారుడిని హత్య చేసిన తండ్రి... ఎక్కడ?

వరుణ్
సోమవారం, 26 ఫిబ్రవరి 2024 (08:31 IST)
నిత్యం మద్యం సేవించి వచ్చి, డబ్బుల కోసం వేధిస్తున్న కుమారుడిని కన్నతండ్రి హత్య చేశాడు. ఈ దారుణ ఘటన షామీర్ పేట మండలంలోని జీనోమ్ వ్యాలీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, షామీర్ పేట మండలంలోని లాల్ గడి గ్రామంలో రామ్ చందర్, మంజుల కుమారుడు కొరివి నరేష్(28) వృత్తిరీత్యా డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు.
 
గ్రామానికి చెందిన కొరివి నరేశ్ ఫిబ్రవరి నెల 11వ తేదీ నుంచి కనిపించట్లేదని 22వ తేదీన తల్లి మంజుల పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తుండగా తన తండ్రి రామచందర్ కన్నకొడుకును హత్య చేశాడని నిర్ధారించారు. మద్యానికి బానిసై డబ్బుల కోసం నిత్యం వేధిస్తున్నాడనే కోపంతో హత్య చేశానని పోలీసు విచారణలో తండ్రి అంగీకరించాడు. 
 
కుమారుడికి మద్యం తాగించి రూ.10 వేలు ఇస్తానని గ్రామ సమీపంలో ఉన్న ఓ బావి దగ్గరికి తీసుకెళ్లాడు. అక్కడ కుమారుడు నరేశ్‌కు పీకల వరకు మద్యం తాగించి అనంతరం బావిలో తోసేశాడు. తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా కొడుకు కనబడటం లేదని కుటుంబ సభ్యులకు తెలిపాడు. భయంతో తల్లి పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టిన పోలీసులు తండ్రి రామచందర్‌పై అనుమానం వచ్చి విచారించడంతో తానే చంపానని తెలిపాడు. మృతుడు నరేశ్‌కి వివాహమై ఏడాదిన్నర పాప ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments