Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాదులో అర్థరాత్రి చెన్నై యువతిపై అత్యాచారం, ఆటోడ్రైవర్ అరెస్ట్

ఐవీఆర్
బుధవారం, 16 అక్టోబరు 2024 (23:25 IST)
సోమవారం అర్థరాత్రి గచ్చిబౌలి పోలీసు స్టేషను పరిధిలో 32 ఏళ్ల చెన్నై యువతిపై జరిగిన అత్యాచారం కేసులో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. సిసి కెమేరా దృశ్యాలు, అతడి ఫోన్ నెంబరు ఆధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడిది నల్లగొండ జిల్లా కేతిపల్లి అని పోలీసుల విచారణలో తేలింది.
 
పూర్తి వివరాలను చూస్తే... చెన్నైకి చెందిన యువతి సోమవారం అర్థరాత్రి హైదరాబాద్ నగర శివారు రామచంద్రాపురం వద్ద గం.1.30 నిమిషాలకు దిగారు. గచ్చిబౌలి నానక్‌రాంగూడ వెళ్లేందుకు ఆమె ఆటో ఎక్కారు. ఆటో డ్రైవర్ సెంట్రల్ యూనివర్శిటీ మెయిన్ రోడ్డులో వున్న మసీదుబండ కమాన్ వద్దకు రాగానే అక్కడ పెద్దగా జనసంచారం లేకపోవడంతో ఆటోను పక్కనే ఆపేసాడు. ఆటో ఎందుకు ఆపావు అని యువతి ప్రశ్నించేలోపుగానే వెనుక సీట్లోకి చొరబడి ఆమె నోరును గట్టిగా నొక్కేసి అత్యాచారానికి పాల్పడ్డాడు.
 
బాధితురాలు గట్టిగా ప్రతిఘటించడంతో ఆమెపై దాడి చేయడం ప్రారంభించాడు. ఆమె గట్టిగా కేకలు వేయడంతో రోడ్డునే వెళ్తున్న ఫుడ్ డెలివరీ బోయ్స్ గమనించి ఆటో వద్దకు వచ్చారు. ఇది గమనించి బాధితురాలిని ఆటో నుంచి కిందకు తోసేసి అతడు పరారయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితురాలిని భరోసా కేంద్రానికి తరిలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ రోజు రాత్రికే 'పుష్ప-2' సత్తా ఏంటో తెలిసిపోతుంది : రాజమౌళి

ఒక సెక్షన్ మీడియా అత్యుత్సాహం చూపుతుంది : ఆర్జీవీ

సిల్క్ స్మిత అఫీషియల్ బయోపిక్ లో చంద్రిక రవి

శ్రీ కనకదుర్గమ్మవారి ఆశీస్సులు కోరిన హరిహరవీరమల్లు టీమ్

ముంబై మెట్రో రైలెక్కిన పుష్ప 2.. ఎందుకు? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపిని సహజసిద్ధంగా తగ్గించుకునే మార్గాలు

రేడియోథెరపీ, ఇంటర్‌స్టీషియల్ బ్రాకీథెరపీని ఉపయోగించి తీవ్రస్థాయి గర్భాశయ సంబంధిత క్యాన్సర్‌ కి చికిత్స

Asthma in Winter Season, ఈ సమస్యను తెచ్చే ఆహార పదార్ధాలు, పరిస్థితులు

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments