చైన్ స్నాచింగ్ అలా నేర్చుకున్న వ్యక్తి అరెస్ట్- రూ.20లక్షల విలువైన బంగారం స్వాధీనం

సెల్వి
బుధవారం, 3 సెప్టెంబరు 2025 (23:12 IST)
ఒంగోలు సీసీఎస్, తాలూకా పోలీసులు మంగళవారం పలు కేసుల్లో నేపస్థుడైన చైన్ స్నాచర్‌ను అరెస్టు చేసి, దాదాపు రూ.20 లక్షల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. గుంటూరులోని రత్నపురి కాలనీకి చెందిన నిందితుడు తాళ్లూరి రాజ్ కుమార్ (30) డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. కానీ సోషల్ మీడియాలో చైన్ స్నాచింగ్ వీడియోలను చూసిన తర్వాత నేరాలకు పాల్పడ్డాడు. 
 
రాజ్ కుమార్ నేరాలు తెనాలిలో ప్రారంభమై, తరువాత బాపట్ల, చీరాల, ఒంగోలు, వినుకొండలకు వ్యాపించాయి. ఈ సంవత్సరం కనీసం నాలుగు ప్రధాన కేసుల్లో అతను పాల్గొన్నాడని పోలీసులు తెలిపారు. ఏప్రిల్ 4, 2025న, బాపట్లలోని జండాచెట్టు వీధి చేపల మార్కెట్ సమీపంలో ఒక మహిళ గొలుసును లాక్కున్నాడు. ఆ తర్వాత ఏప్రిల్ 24న చీరాలలో మరో సంఘటన జరిగింది. 
 
జూలై 18న ఒంగోలులోని లేడీస్ హాస్టల్‌లో, ఆగస్టు 8న వినుకొండ మెయిన్ బజార్‌లో అతను చైన్ స్నాచింగ్ చేశాడు. అయితే సీసీఎస్ సీఐ ఎస్. జగదీష్, తాలూకా సీఐ టి. విజయ్ కృష్ణ నేతృత్వంలోని ప్రత్యేక బృందాలు సాంకేతిక నిఘా ద్వారా అతనిని ట్రాక్ చేసి ఒంగోలు ఐటీఐ సమీపంలో అరెస్టు చేశాయి. దీంతో పలు నేరాల్లో నిందితుడైన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసినట్లైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

ఇకపై చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు విదేశీ విరాళాలు

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments