Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరో వ్యక్తితో చాటింగ్.. తల్లీకూతురుని హత్య చేసిన కిరాతకుడు!!

ఠాగూర్
సోమవారం, 24 మార్చి 2025 (09:44 IST)
ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో దారుణం జరిగింది. మరో వ్యక్తితో ఫోనులో చాటింగ్ చేస్తుందని భావించిన ఓ వ్యక్తి తల్లితో పాటు ఆమె కుమార్తెను కూడా హత్య చేశాడు. ఈ దారుణం రాజమండ్రి హక్కంపేట డి బ్లాకులో చోటుచేసుకుంది. మృతులను ఎండీ సల్మాన్ (38), ఆమె కుమార్తె ఎండీ సానియా (16)లుగా గుర్తించారు. ఈ హత్యల తర్వాత నిందితుడు నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. 
 
పోలీసుల కథనం మేరకు.. హక్కంపేటకు చెందిన సల్మాన్ ఈవెంట్ కార్యక్రమాల్లో పాల్గొనేది. ఆమెతో కలిసి నిందితుడు శివకుమార్ కూడా వెళ్లేవాడు. అలా వారిద్దరి మధ్య సన్నిహిత సంబంధం ఏర్పడింది. ఈ క్రమంలో తనను కాదని మరో వ్యక్తిని సల్మాన్ చాటింగ్ చేస్తుండటాన్ని శివకుమార్ జీర్ణించుకోలేక పోయాడు. 
 
ఈ విషయంపై ఆమెతో తీవ్ర వాగ్వాదానికి దిగాడు. చిన్నచిన్న మాటలతో మొదలైన గొడవ తీవ్రస్థాయికి చేరుకుని చివరకు హత్యకు దారితీసింది. తల్లిని, కుమార్తెను హత్య చేసిన శివకుమార్ అక్కడ నుంచి నేరుగా ఠాణాకు వెళ్లి పోలీసులకు లొంగిపోయాడు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒక అద్భుతమైన సినిమా చూశా.. ఎవరూ మిస్ కావొద్దు : ఎస్ఎస్ రాజమౌళి

హీరో విశాల్‌కు పెళ్లి కుదిరింది.. వధువు ఎవరంటే?

ఈ బర్త్ డే నుంచి నాకు కొత్త జన్మ మొదలు కాబోతోంది : మంచు మనోజ్

హీరో మహేశ్ బాబు కుటుంబంలో కరోనా వైరస్!!

జూనియర్ వెరీ ఎమోషన్ టచ్చింగ్ స్టొరీ : దేవిశ్రీ ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments