Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెల్లిని ప్రేమించిన యువకుడిని నరికి చంపి కుక్కలకు ఆహారం... ఎక్కడ?

Webdunia
మంగళవారం, 27 డిశెంబరు 2022 (08:32 IST)
బిహార్ రాష్ట్రంలో దారుణం జరిగింది. పరువు హత్య జరిగింది. తన చెల్లిని ప్రేమించిన ఓ యువకుడిని ఓ వ్యక్తి అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. ఆ తర్వాత శరీర భాగాలను ముక్కలుగా చేసిన కుక్కలకు ఆహారంగా వేశాడు. స్థానికంగా సంచలనం సృష్టించిన ఈ ఘటన బీహార్ రాష్ట్రంలోని నలంద జిల్లాలో జరిగింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ జిల్లాకు చెందిన బిట్టు కుమార్ అనే వ్యక్తి ఈ నెల 16వ తేదీ నుంచి కనిపించకుండా పోయాడు. కుటుంబ సభ్యులు ఎంతగా గాలించినా ఆచూకీ కనిపెట్టలేకపోయారు. దీంతో వారు 18వ తేదీన స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ చేపట్టారు. ఈ క్రమంలో బిట్టు ఓ యువతితో ప్రేమలో ఉన్నట్టు తెలుసుకున్నారు. దీంతో ఆ యువతి సోదరుడు రాహుల్‌ను అనుమానించి అదుపులోకి తీసుకుని విచారించగా, అసలు విషయాన్ని బట్టబయలు చేశాడు.
 
తన సోదరిని ప్రేమిస్తూ, ఆమెతో సన్నిహితంగా ఉండటాన్ని జీర్ణించుకోలేక చంపేసినట్టు అంగీకరించాడు. ఇందులోభాగంగా, ఈ నెల 16వ తేదీన మద్యం సేవిద్దామని నమ్మించి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి హత్య చేశానని, శరీరాన్ని ముక్కలు చేసి కుక్కలకు ఆహారంగా వేసినట్టు చెప్పాడు. మిగిలిన భాగాలను నదిలో పడేసినట్టు వాంగ్మూలం ఇచ్చాడు. దీంతో రాహుల్‌ను అరెస్టు చేశారు. నదిలో పడేసిన శరీర భాగాల కోసం గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments