ఒకే యువకుడితో తల్లీ కుమార్తె అక్రమ సంబంధం - అతనితో కలిసి భర్త హత్య!!

ఠాగూర్
సోమవారం, 3 ఫిబ్రవరి 2025 (09:09 IST)
బీహార్ రాష్ట్రంలోని భాగల్‌పూర్‌లో ఓ దారుణ హత్యకు సంబంధించిన ఆసక్తికర విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. తల్లీ కుమార్తె కలిసి ఓ వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్నారు. ఈ విషయంలో కట్టుకున్న భర్తకు తెలియడంతో భార్య, కుమార్తెను మందలించారు. దీన్ని జీర్ణించుకోలేని తల్లీ కుమార్తెలు పథకం ప్రకారం తమ ప్రియుడుతో కలిసి భర్తను చంపేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
భాగల్‌పూర్‌కు సమీపంలోని బారిరామసి గ్రామంలో కైలు దాస్ (35) అనే వ్యక్తికి భార్య సరితా దేవి, కుమార్తె జూలీ, ఇద్దరు కుమారులు దయానంద్, దేవానంద్‌లు ఉన్నారు. కైలు దాస్ ఓ చిన్న హోటల్ పెట్టుకుని కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలో జూలీకి దినేష్ యాదవ్ అనే యువకుడు పరిచయమయ్యాడు. దీంతో అతను తరచుగా ఇంటికి వస్తూపోతుండేవాడు. ఈ క్రమంలో అతనితో సరితా దేవి కూడా అక్రమ సంబంధం పెట్టుకుంది. ఈ విషయం కైలు దాస్‌కు తెలియడంతో భార్యా, కుమార్తెను మందలించాడు. దీంతో ఆగ్రహించిన జూలీ, సరితాదేవి... శుక్రవారం రాత్రి తమ ప్రియుడితో తలిసి కైలు దాస్‌ను హత్య చేసి, ఇంటి ఆవరణలోనే పాతిపెట్టారు. ఆ తర్వాత ఏమీ తెలియనట్టుగా ఉండిపోయారు. 
 
ఈ క్రమంలో పెద్ద కుమారుడు దయానంద్ ఇంటికి వచ్చిన తండ్రి కనిపించకపోవడంతో తల్లిని అడిగాడు. ఆమె చెప్పిన సమాధానంతో సంతృప్తి చెందకపోవడంతో పాటు అనుమానించాడు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ విచారణలో అసలు విషయం వెల్లడైంది. దీంతో సరితాదేవి, జూలిలతో పాటు వారికి సహకరించి దినేష్ యాదవ్‌లను కూడా అరెస్టు చేశారు. ఒకే వ్యక్తితో అక్రమం సంబంధం పెట్టుకుని తమ ఇంటి యజమానిని కట్టుకున్న భార్య, కుమార్తె హత్య చేయడం స్థానికంగా కలకలం సృష్టించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ది గర్ల్ ఫ్రెండ్' కోసం ముఖ్య అతిథిగా హాజరుకానున్న విజయ్ దేవరకొండ?

నవంబర్ 15న జియోహాట్‌స్టార్‌లో ఎస్ఎస్ రాజమౌళి గ్లోబ్‌ట్రోటర్ ఫస్ట్ లుక్, టీజర్ లాంచ్‌ లైవ్ స్ట్రీమ్

మహిళల శరీరాకృతి ఎపుడూ ఒకేలా ఉండదు : మిల్కీ బ్యూటీ

కోలీవుడ్ హీరో అజిత్ ఇంటికి బాంబు బెదిరింపు

అలాంటి పాత్రలు వస్తే మొహమాటం లేకుండా నో చెప్పేస్తా : మీనాక్షి చౌదరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

తర్వాతి కథనం
Show comments