Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒంటరిగా ఉన్న మహిళతో మాటలు కలిపారు.. హోటల్‌కు తీసుకెళ్లిన అత్యాచారం చేశారు...

ఠాగూర్
శనివారం, 22 ఫిబ్రవరి 2025 (08:41 IST)
కర్నాటక రాష్ట్రంలోని బెంగుళూరు నగరంలో ఓ దారుణం జరిగింది. కోరమంగళ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ హోటల్‌‌లో మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. ఒంటరిగా ఉన్న మహిళతో నలుగురు యువకులు మాటలు కలిపారు. ఆ తర్వాత ఆ మహిళను హోటల్‌ గదిలోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారం జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
33 యేళ్ళ ఓ మహిళ జ్యోతి నివాస్ కాలేజీ జక్షంన్ వద్ద వేచివుంది. ఆ సమయంలో 20 యేళ్ల వయస్సున్న నలుగురు యువుకులు ఆ మహిళ వద్దకు వచ్చి మాటలు కలిపారు. ఆ తర్వాత స్నేహంగా మెలిగి డిన్నర్‌కు ఆహ్వానించాడు. ఆ తర్వాత ఆమెను గదిలోకి తీసుకుని అసభ్యంగా ప్రవర్తించారు. ఈ ప్రైవేట్ హోటల్‌ టెర్రాస్‌పైకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి ఒడిగట్టినట్టు పోలీసులు తెలిపారు. 
 
ఈ విషయం గురించి ఎవరికీ చెప్పొద్దని ఆమెను బెదిరించారు. ఆ తర్వాత శుక్రవారం ఉదయం 6 గంటలకు విడిచిపెట్టారని పేర్కొన్నారు. ఉదయం ఇంటికి చేరుకున్నాక జరిగిన దారుణం గురించి భర్తకు వివరించగా, పోలీసులను ఆశ్రయించినట్టు తెలిపారు. బాధిత కుటుంబం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. 
 
ఈ ఘటనపై డిప్యూటీ కమిషనర్ సారా ఫాతిమా స్పందిస్తూ, శుక్రవారం ఉదయం 7.30 - 8 గంటల సమయంలో ఈ ఘటనపై తమకు సమాచారం అందిందన్నారు. ఈ దారుణానికి ఒడిగట్టిన నలుగురు నిందితులను అరెస్టు చేసి, బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించినట్టు వెల్లడించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం బాగాన్ని ఉన్నట్టు తెలిపారు. అయితే, ఆ యువకులతో ఆమె ఎందుకు వెళ్లారనే విషయాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. 
 
ఢిల్లీకి చెందిన ఈ మహిళ తన భర్తతో బెంగుళూరులో స్థిరపడ్డారని, ఆమె క్యాటరింగ్ సర్వీసెస్‌లో పనిచేస్తుందని పోలీసులు వివరించారు. నిందితులు తన స్నేహితుడుని కలిసేందుకు అక్కడకి వెళ్లినట్టుగా ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments