Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాత్రూమ్‌లో కలిసి స్నానం చేస్తూ ప్రాణాలు కోల్పోయిన యువజంట.. ఎక్కడ?

Webdunia
మంగళవారం, 13 జూన్ 2023 (09:18 IST)
మరికొన్ని రోజుల్లో వివాహం చేసుకోబోతున్న ఓ యువజంట బాత్రూమ్‌లో మృత్యువాతపడింది. వీరిద్దరూ కలిసి బాత్రూమ్‌లో స్నానం చేస్తుండగా, గీజర్‌లో నుంచి గ్యాస్ లీకై దుర్మరణం పాలయ్యారు. ఈ విషాదకర ఘటన కర్నాటక రాష్ట్రంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
 
చామరాజనగర్‌ జిల్లాకు చెందిన చంద్రశేఖర్ (30), బెళగావి జిల్లాకు చెందిన సుధారాణి (22)లు గత కొంతకాలంగా సహజీవనం చేస్తున్నారు. వారిద్దరూ బెంగుళూరులోని ఓ హోటల్‌‍లో పని చేస్తూ, త్వరలోనే పెళ్లి పీటలెక్కాలని నిర్ణయం తీసుకున్నారు.
 
ఈ క్రమంలో శనివారం రాత్రి స్నానం చేసేందుకు బాత్రూమ్‌కు వెళ్ళిన వారిద్దరూ కిటికీలు మూసివేశారు. అయితే, వారు స్నానం చేస్తుండగా, గీజర్ నుంచి కార్బన్ మోనాక్సైడ్ విషవాయువు విడుదలైంది. దీంతో స్పృహతప్పి బాత్రూమ్‌లో పడిపోయి, కొద్దిసేపటికి ప్రాణాలు విడిచారు. ఆదివారం ఆ జంట విధులకు హాజరుకాకపోవడంతో సహోద్యోగులు వారి ఇంటికి వెళ్లారు.
 
ఎన్నిసార్లు తలుపులు కొట్టినా స్పందన లేకపోవడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు.. తలుపులు బద్ధలు కొట్టి ఇంట్లోకి వెళ్లి చూడగా వారిద్దరూ బాత్రూమ్‌లో శవాలై కనిపించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను వారి బంధువులకు అప్పగించారు. 
 
భర్తను కాల్చిపారేసిన భార్య... ఎక్కడ? 
భర్త హత్య కేసులో భార్యను పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం రాత్రి విపరీతంగా మద్యం తాగి వచ్చి భార్యను చితకబాదాడు. దీంతో ఆగ్రహించిన భార్య.. ఇంట్లోని తుపాకీతో భర్త ఛాతిపై కాల్పులు జరిపడంతో ఆయన ప్రాణాలు కోల్పోయాడు. ఆ తర్వాత తన భర్త నాటు తుపాకీతో ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులను నమ్మించే ప్రయత్నం చేసి, ఇపుడు జైలు ఊచలు లెక్కిస్తుంది. మృతుడు బీజేపీ నేత కాగా, ఈ ఘటన మీరట్‌లో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
నిశాంత్ గార్గ్ అనే బీజేపీ నేత ఇటీవల హత్యకు గురయ్యాడు. ఆయన మృతదేహాన్ని పోలీసుల సోమవారం గుర్తించారు. మృతదేహంపై తుపాకీ గాయాలు ఉన్నట్టు గుర్తించారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి ఆయన భార్య సోనియాను పోలీసులు అరెస్టు చేశారు. సోనియాపై అనుమానాలు రావడంతోనే ఆమెను అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు. ఆ తర్వాత ఆమెను కోర్టులో హాజరుపరచగా, జ్యూడీషియల్ కస్టడీకి విధించింది. 
 
అయితే, తన భర్త నాటు తుపాకీతో కాల్చుకున్నాడని తొలుత చెప్పిన సోనియా... తమ మధ్య జరిగిన కొట్టాటలో తుపాకీ ఒక రౌండ్ పేలి తన భర్త ఛాతిలోకి దూసుకెళ్లిందని చెప్పింది. ఆ తర్వాత మాట మార్చి.. శుక్రవారం రాత్రి విపరీతంగా మద్యం తాగివచ్చి తనను కొట్టాడని, అందుకే ఆయనను తుపాకీతో కాల్చిపారేసినట్టు చెప్పింది. విచారణలో ఒక అల్మారా నుంచి పిస్టల్‌తో పాటు గార్గ్ మొబైల్‌ను కూడా తీసుకొచ్చి ఇచ్చిందని తెలిపారు. మృతుడు గార్గ్ వెస్ట్ యూపీ బీజేపీ యువమోర్ఛా సోషల్ మీడియా ఇన్‌చార్జ్‌గా ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: ఎన్టీఆర్ అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తి.. భారతరత్నతో సత్కరించాలి

బాలీవుడ్‌కు బైబై చెప్పనున్న కీర్తి సురేష్... ఆ కొత్త ఛాన్స్ కలిసొస్తుందా?

సైఫ్ అలీ ఖాన్‌పై దాడి.. నిందితుడు బిజోయ్ దాస్ విషయాలు.. ఎక్కడ నుంచి వచ్చాడంటే?

Bulli Raju: సంక్రాంతికి వస్తున్నాం.. బుల్లిరాజుకు పవన్ కల్యాణ్ ఇష్టమట...

సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి చొరబడిన వ్యక్తి బంగ్లాదేశ్ జాతీయుడే..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరం లావయ్యేందుకు కారణమయ్యే అలవాట్లు ఇవే

నువ్వుండలను తింటున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

భారతదేశంలో సామ్‌సంగ్ హెల్త్ యాప్‌లో వ్యక్తిగత ఆరోగ్య రికార్డుల ఫీచర్‌ను ప్రవేశపెట్టిన సామ్‌సంగ్

యూరిక్ యాసిడ్ ఎలా తగ్గించుకోవాలి?

HMPV వ్యాధి నిరోధించేందుకు చిట్కాలు

తర్వాతి కథనం
Show comments