బెంగుళూరులో పార్టీకి వెళ్లి వస్తున్న యువతిపై బైకర్ అఘాయిత్యం

ఠాగూర్
సోమవారం, 19 ఆగస్టు 2024 (11:43 IST)
దేశంలో మహిళలు, యువతులపై జరుగుతున్న అఘాయిత్యాల సంఖ్య నానాటికీ పెరిగిపోతున్నాయి. తాజాగా పార్టీకి వెళ్లి వస్తున్న యువతిపై బైకర్ అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ సంఘటన బెంగుళూరు ఈస్ట్ జోన్ పరిధిలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
బెంగుళూరు నగరంలోని ఓ కాలేజీలో డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థిని కోరమంగళ ప్రాంతంలో గెట్ టుగెదర్ పార్టీకి హాజరైంది. ఆ పార్టీ ముగిసిన తర్వాత వేకువజామున తిరిగి వచ్చే క్రమంలో, ఓ వ్యక్తిని లిఫ్ట్ అడిగింది. బైకుపై ఆ అమ్మాయిని ఎక్కించుకున్న ఆ వ్యక్తి... ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. 
 
ఈ కేసులో నిందితుడు ఒక్కడే అని, బైకుపై లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తే అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. దీనిపై బెంగళూరు ఈస్ట్ జోన్ ఏసీపీ రమణ్ గుప్తా మాట్లాడుతూ, పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారని, బాధితురాలితోనూ, ఆమె కుటుంబ సభ్యులతోనూ మాట్లాడారని వెల్లడించారు.
 
అత్యాచార ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం సేకరించామని, పోలీసులు ఐదు బృందాలుగా ఏర్పడి నిందితుడి కోసం గాలింపు చేపట్టినట్టు వివరించారు. త్వరలోనే రేపిస్టును అరెస్టు చేస్తామని తెలిపారు. ఒకవైపు, కోల్‌కతాలో మహిళా మెడికోపై జరిగిన హత్యాచారం ఘటనతో దేశంలో నిరసనలు తీవ్ర స్థాయిలో జరుగుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raviteja: మాస్ జాతర లో ఆర్‌పిఎఫ్ పాత్ర గురించి రవితేజ ఏమన్నాడో తెలుసా!

Chiru: మన శంకర వర ప్రసాద్ గారు కోసం సర్ ప్రైజ్ ఇవ్వనున్న అనిల్ రావిపూడి

Priyadarshi: యువత అల్లరి, రహస్యాన్ని సమాన స్థాయిలో మిళితం చేసే మిత్ర మండలి ట్రైలర్

Yash: కేజీఎఫ్ చాప్టర్-2తో టాక్సిక్ పోటీపడలేదు.. యష్ వల్లే అంతా జరిగింది: కేఆర్కే

మా కుమార్తె ముఖాన్ని అందుకే చూపించడం లేదు : ఉపాసన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

తర్వాతి కథనం