యాప్ డౌన్‌లోడింగ్‌లో జాప్యం.. కుమారుడిని కత్తితో పొడిచిన తండ్రి...

Webdunia
ఆదివారం, 18 జూన్ 2023 (10:05 IST)
మొబైల్ ఫోనులో ఒక యాప్ డౌన్‌లోడ్ కావడంలో కాస్త జాప్యమైంది. దీంతో పట్టరాని కోపంతో కుమారుడిని ఓ కసాయి తండ్రి కత్తితో పొడిచాడు. ఈ దారుణ ఘటన ఢిల్లీలోని గురుగ్రామ్‌లో వెలుగు చూసింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
గురుగ్రామ్‌కు చెందిన అశోక్ సింగ్ (64) అనే వ్యక్తి ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్‌లో సీనియర్ మేనేజరుగా పని చేసి రిటైర్ అయ్యారు. ఆయనకు భార్య, కుమారుడు ఉన్నాడు. ఆయన కుమారుడు ఆదిత్య (23) కంప్యూటర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. అశోక్ ఇటీవలే గురుగ్రామ్‌లో ఓ ఫ్లాట్ కూడా కొనుగోలు చేశాడు.
 
ఈ క్రమంలో నగదు చెల్లింపుల కోసం మొబైల్ ఫోనులో ఓ యాప్ డౌన్‌లోడ్ చేయాలని భార్యకు చెప్పాడు. కానీ, డౌన్‌లోడింగ్‌లో జాప్యం జగుతుండటంతో తీవ్ర అసహనానికి గురైన ఆయన భార్యతో గొడవకు దిగాడు. ఈ క్రమంలో తనకు అడ్డుపడిన కొడుకును కత్తితో పొడిచాడు. 
 
ఫలితంగా ఆదిత్యను ఆస్పత్రిలో చేర్పించాల్సివచ్చింది. గాయాలకు చికిత్స చేసిన తర్వాత వైద్యులు అతడిని డిశ్చార్జ్ చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు అశోక్ సింగ్‌‍పై మారణాయుధంతో కావాలని దాడికి దిగాడన్న సెక్షన్ కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

చిరంజీవిని శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానించిన వంశీ కృష్ణ

Anaswara Rajan: ఛాంపియన్ నుంచి చంద్రకళగా అనస్వర రాజన్ గ్లింప్స్ రిలీజ్

Bunny Vas: ఐ బొమ్మ రవి సపోర్టర్లపై బన్నీ వాస్ ఎదురుదాడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments