Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరలక్ష్మీదేవి పూజకు అన్నీ సిద్ధం చేసుకుని ... అంతలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య

Webdunia
శనివారం, 26 ఆగస్టు 2023 (11:31 IST)
శుక్రవారం వరలక్ష్మీదేవి పూజను ఘనంగా చేసుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అంతలో ఏమైందో ఏమోగానీ.. ఆ కుటుంబ సభ్యులు పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకున్నారు. భార్యాభర్తలతో పాటు వారి కుమార్తె పురుగుల మందు తాగారు. వీరిలో భార్యాభర్తలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కుమార్తె పరిస్థితి విషమంగా ఉంది. విశాఖపట్టణం జిల్లా పెందుర్తి మండలం గొరపల్లి గ్రామంలో ఈ విషాద ఘటన జరిగింది. 
 
పోలీసుల కథనం మేరకు.. కల్లూరి సత్తిబాబు(57) స్థానికంగా కిరాణా దుకాణం నిర్వహిస్తుంటారు. ఈయనకు భార్య సూర్యకుమారి(48), కుమార్తె నీలిమ(24), కుమారుడు సంతోష్ కుమార్ ఉన్నారు. సంతోష కుమార్ నగరంలోని ఓ ప్రైవేట్ బ్యాంకులో పని చేస్తుంటారు. కుమార్తె నీలిమ డిగ్రీ పూర్తిచేసి ఇంటి వద్దే ఉంటున్నారు. సత్తిబాబు కుటుంబ అవసరాలు, వ్యాపారం కోసం ఇటీవల పలుచోట్ల అప్పులు చేశారు. వాటిని తీర్చడంలో జాప్యం జరిగింది. ఆ క్రమంలో రుణదాతలు ఒత్తిడి తీవ్రం చేశారు. 
 
ఈ నేపథ్యంలో గురువారం రాత్రి 11 గంటలు దాటిన తర్వాత సత్తిబాబు, ఆయన భార్య సూర్యకుమారి, కుమార్తె నీలిమ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. సూర్యకుమారి గ్రామంలోనే ఉంటున్న వారి బంధువులకు ఫోన్ చేసి విషయం తెలిపారు. వారు గ్రామస్థులతో కలిసి అక్కడికి చేరుకుని ముగ్గురినీ కేజీహెచ్‌కు తరలించారు. చికిత్స పొందుతూ సత్తిబాబు శుక్రవారం ఉదయం మృతి చెందగా, మధ్యాహ్నం భార్య సూర్యకుమారి మరణించారు. కుమార్తె నీలిమ పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన జరిగిన సమయంలో సంతోషకుమార్ ఇంటి వద్ద లేరు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గుమ్మడికాయ కొట్టిన గేమ్ ఛేంజర్ - ఫ్యాన్స్ ఫిదా

అదే ఫీల్డ్ లో వర్క్ చేయడం ఆనందంగా వుంది : డార్లింగ్ ప్రొడ్యూసర్ చైతన్య రెడ్డి

అల్లు శిరీష్ బడ్డీ సినిమా నుంచి ఫీల్ ఆఫ్ బడ్డీ రిలీజ్

ప్రేక్షకుల మధ్య విజయ్ ఆంటోనీ యాక్షన్ ఫిల్మ్ తుఫాన్ ట్రైలర్ ఇంట్రడక్షన్

మిస్టర్ బచ్చన్ లో రవితేజ, భాగ్యశ్రీ బోర్సే పై సితార్ సాంగ్ షూట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments