బీహారు రాష్ట్రంలో ఓ బలవంతపు పెళ్లి జరిగింది. ఉదయాన్నే పాఠశాలకు వెళుతున్న ఉపాధ్యాయుడిని తుపాకులతో బెదిరించిన కొందరు వ్యక్తులు అతడిని కిడ్నాప్ చేసి ఓ గుడికి తీసుకెళ్లారు. అక్కడ పెళ్లికుమార్తె దుస్తుల్లో ముస్తాబై వున్న లఖిసరాయ్ అనే వధువుతో అతడికి పెళ్లి చేసారు. ఆ సమయంలో అతడి కాళ్లను కట్టేసారు. చేతులు రెండూ ఇద్దరు వ్యక్తులు పట్టుకుని బలవంతంగా పెళ్లి కానించేసారు. ఈ ఘటన బీహారు రాష్ట్రంలోని కితహార్ జిల్లాలో జరిగింది.