Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్నేహితుడి భార్యను కోర్కె తీర్చమంటూ వేధింపులు, భర్తకి చెప్పుకోలేక భార్య ఆత్మహత్య

Webdunia
మంగళవారం, 8 మార్చి 2022 (23:32 IST)
వాళ్ళిద్దరు ప్రాణ స్నేహితులు. ఇద్దరికీ పెళ్ళిళ్ళు అయ్యాయి. ఒక అతనికి సంవత్సరంలో పిల్లలు పుట్టారు. మరొక స్నేహితుడికి ఇంకా పిల్లలు పుట్టలేదు. స్నేహితులు కావడంతో ఒకరి ఇంటికి మరొకరు వచ్చి వెళుతుండేవారు.


అయితే స్నేహితుడి భార్యను సోదరిగా భావించాల్సిన వ్యక్తి వక్రబుద్ధిని చూపించాడు. ఆమెకు ఫోన్ చేసి వల్గర్‌గా మాట్లాడేవాడు. తన భర్తకు ఆ విషయం చెబితే వారిద్దరి స్నేహం చెడిపోతుందని మనస్సులోను దాచుకుంది ఆ వివాహిత.. చివరకు..

 
తెలంగాణా రాష్ట్రం మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం ముత్యంపేటకు చెందిన వివాహిత మౌనిక మూడురోజుల క్రితం ఇంట్లో నుంచి వాంతులు చేసుకుంటూ బయటకు వచ్చింది. దీంతో హుటహుటిన కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. కానీ ఆమె చికిత్స పొందుతూ చనిపోయింది.

 
కానీ తన సెల్ ఫోన్‌లో ఏం జరిగిందన్న విషయాన్ని స్పష్టంగా ఆడియో ద్వారా తెలిపింది. తన భర్త అంటే తనకు ఎంతో ఇష్టమని.. ఇంకా పిల్లలు లేకపోయినా ఆనందంగా ఉన్నానని చెప్పింది. తన భర్త స్నేహితుడు ప్రతాప్ తనతో అసభ్యంగా ప్రవర్తించేవాడని... సెల్ ఫోన్లో ఏవేవో మాట్లాడుతూ ఉండేవాడని చెప్పింది.

 
ఈవిషయం తన భర్తకు చెబితే వారిద్దరి మధ్య స్నేహం విడిపోతుందని.. గొడవలు అవుతాయని కూడా అందులో తెలిపింది. విషయం కాస్త బయటకు రావడంతో ప్రతాప్ ఆవేదనకు గురయ్యాడు. తన స్నేహితుడి భార్య తన వల్ల చనిపోయిందన్న బాధతో రైలు కింద పడి చనిపోయాడు. ప్రతాప్ చేసిన పనికి రెండు కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయి. ప్రతాప్ సంవత్సరం బిడ్డ ఉంది. ప్రతాప్ భార్య బోరున విలపిస్తూ ఉంది. కుటుంబ సభ్యులు ఆమెను ఓదార్చలేకపోతున్నారట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ చరణ్ తాజా టైటిల్ పెద్ది - మైసూర్ లో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ?

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments