ప్రేమించిన యువతి బ్రేకప్ చెప్పిందని మోటారు బైకుతో ఢీకొట్టిన ప్రేమికుడు (video)

ఐవీఆర్
శుక్రవారం, 26 సెప్టెంబరు 2025 (21:36 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్ నగరంలో దారుణం జరిగింది. తనను ప్రేమించిన యువతి తనకు బ్రేకప్ చెప్పిందని మోటారు బైకుతో ఢీకొట్టి తీవ్రంగా గాయపరిచాడు. రోడ్డుపై పడిపోయిన యువతిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేసారు..
 
తెలిసితెలియని వయసులోనే ప్రేమలు. సెల్ ఫోన్లలో వచ్చే సమాచారం మరింత రెచ్చగొడుతుండటం, సోషల్ మీడియాలో వచ్చే వీడియోలు వాటికి ఆజ్యం పోయడంతో చాలామంది చిన్న వయసులోనే పక్కదారి పడుతున్నారు. ప్రేమ పేరుతో చదువుకునే వయసులోనే జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇలాంటి ఘటనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇంతకీ ఏం జరిగిందంటే...తన కుమార్తె ప్రతిరోజూ పాఠశాలకు వెళ్తుంది. కానీ ఇటీవల కొన్నిరోజులుగా ఆమె ప్రవర్తనలో మార్పు వచ్చింది.
 
స్కూలుకని చెప్పి స్కూల్ యూనిఫార్మ్ కాకుండా రంగురంగు దుస్తులను వేసుకుని విపరీతంగా అలంకరించుకుని వెళ్తోంది. దీనితో కుమార్తె వ్యవహారంపై తల్లికి అనుమానం వచ్చింది. దాంతో ఆమె స్కూలుకని చెప్పి వెళ్తుండగా ఆమె వెనకాలే నక్కినక్కి వెంబడించింది. అలా కొంతదూరం వెళ్లాక దారి మధ్యలో ఆ బాలికను ఆమె ప్రియుడు కలిశాడు. ఇద్దరూ కలిసి సమీపంలోని పొలాల్లోకి వెళ్లి సరసాలు మొదలుపెట్టారు. ఈ వ్యవహారం చూసిన బాలిక తల్లి తీవ్ర ఆగ్రహానికి గురైంది.
 
నేరుగా పొలాల్లోకి వెళ్లి కుమార్తెను పట్టుకుని రోడ్డుపైకి ఈడ్చుకొచ్చి విచక్షణారహితంగా కొట్టడం ప్రారంభించింది. కుమార్తెపై దాడి చేస్తుండటంతో అటుగా వెళ్లేవారు ఆమెను అడ్డుకున్నారు. బాలికపై దాడి చేయకుండా రక్షించారు. కాగా ఈ వీడియోను చూసిన నెటిజన్లు తలోరకంగా స్పందిస్తున్నారు. చదువుకునేందుకు వెళ్లే బాలిక ఇలాంటి పని చేయడమేంటని ఒకరు కామెంట్ చేయగా... ఇలాంటి వారికి కౌన్సిలింగ్ ఇప్పించాలనీ, అసలు పాఠశాలల్లో చిన్నవయసులో దారి తప్పుతున్న బాలబాలికల ఘటనలకు సంబంధించి విషయాలను తెలియజేస్తే వారు ఇలాంటి రొంపిలో పడరంటూ మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sethupathi: పూరి సేతుపతి టైటిల్, టీజర్ విడుదల తేదీ ప్రకటన

NTR: హైదరాబాద్‌లో కాంతార: చాప్టర్ 1 ప్రీ-రిలీజ్ కు ఎన్టీఆర్

Pawan: హృతిక్, అమీర్ ఖాన్ కన్నా పవన్ కళ్యాణ్ స్టైల్ సెపరేట్ : రవి కె చంద్రన్

OG collections: ఓజీ తో ప్రేక్షకులు రికార్డ్ కలెక్టన్లు ఇచ్చారని దానయ్య ప్రకటన

Avatar: అవతార్: ది వే ఆఫ్ వాటర్ 3Dలో పునఃవిడుదల తెలుపుతూ కొత్త ట్రైలర్‌ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అధిక ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్‌కు చికిత్స చేయడం మెరుగైన గుండె ఆరోగ్యానికి దశల వారీ మార్గదర్శి

Alarm: మహిళలూ.. అలారం మోత అంత మంచిది కాదండోయ్.. గుండెకు, మెదడుకు..?

కిడ్నీలను పాడు చేసే పదార్థాలు

అల్లం టీ తాగితే ఏంటి ప్రయోజనాలు?

భారతీయ రోగులలో ఒక కీలక సమస్యగా రెసిస్టంట్ హైపర్‌టెన్షన్: హైదరాబాద్‌ వైద్య నిపుణులు

తర్వాతి కథనం
Show comments