వైద్యుడి నిర్లక్ష్యం... ఇద్దరు నవజాత శిశువుల ప్రాణాలు తీసింది.. ఎక్కడ

Webdunia
మంగళవారం, 26 సెప్టెంబరు 2023 (11:14 IST)
ఓ వైద్యుడి నిర్లక్ష్యం ఇద్దరు నవజాత శిశువుల ప్రాణాలు తీసింది. తాను హాయిగా కునుకు తీసేందుకు వీలుగా ఏసీ వేసుకోగా.. ఆ చలికి తట్టుకోలేక ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని శామలి జిల్లాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఈ రాష్ట్రంలోని కైరాణా ప్రభుత్వ ఆసుపత్రిలో శనివారం ఇద్దరు పిల్లలు జన్మించారు. ఆ తర్వాత వారిని మెరుగైన చికిత్స కోసం సమీపంలోని ఓ ప్రైవేట్ క్లినిక్‌కు తరలించారు. వీరిద్దరిని ఫొటోథెరపీ యూనిట్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే, ఇద్దరు చిన్నారులను పట్టించుకోని డాక్టర్ నీతు.. నిద్రపోవడానికి రాత్రంతా ఏసీని వేసుకున్నారు. 
 
ఆదివారం ఉదయాన్నే చిన్నారులను చూసేందుకు కుటుంబ సభ్యులు వెళ్లేసరికి విగతజీవులై కనిపించారు. దీంతో ఆగ్రహించిన కుటుంబ సభ్యులు.. ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. డాక్టరుపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. పైగా, వారు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.. డాక్టర్ నీతును అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సైబర్ క్రైమ్ పోలీసులను మళ్లీ ఆశ్రయించిన చిరంజీవి

Rajamouli : బాహుబలి ఎపిక్ తో రాజమౌళి అందరికీ మరో బాట వేస్తున్నారా !

Peddi: రామ్ చరణ్, జాన్వీ పై కేరళ లోని రైల్వే టనల్ దగ్గర పెద్ది షూటింగ్

సినిమాలకు గుడ్‌బై చెప్పనున్న సూపర్ స్టార్ రజనీకాంత్?

China Peace : స్పై డ్రామా చైనా పీస్ నుంచి ఇదేంటో జేమ్స్ బాండ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments