Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరల్డ్ కప్ 2019 : పడిన టాస్.. బ్యాటింగ్ ఎంచుకున్న భారత్

Webdunia
ఆదివారం, 16 జూన్ 2019 (14:49 IST)
ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా మాంచెష్టర్‌లోని ఓల్డ్ ట్రాఫర్డ్‌లో భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య కీలక మ్యాచ్ ఆదివారం జరుగుతోంది. ఈ దాయాదుల పోరుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే, ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచివుంది. దీంతో మ్యాచ్ జరుగుతుందా లేదా అనేదానిపై ఉత్కంఠ నెలకొనగా, ఎట్టకేలకు టాస్ పడింది. కాసేపట్లో ప్రారంభం కానున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్థాన్ బౌలింగ్ ఎంచుకుంది. వాతావరణం అనుకూలంగా ఉండటంతో బౌలింగ్ ఎంచుకున్నామని పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ తెలిపాడు. 
 
అయితే, ఈ మ్యాచ్‌కు ఆతిథ్యమిస్తున్న మాంచెస్టర్‌లో ఉదయం నుంచి వర్షం అడపాదడపా కురుస్తుండడం కాస్తంత ఆందోళన కలిగిస్తోంది. కాగా, టీమిండియాలో ఒక మార్పు చోటుచేసుకుంది. గాయపడిన శిఖర్ ధావన్ స్థానంలో ఆల్ రౌండర్ విజయ్ శంకర్‌కు స్థానం కల్పించారు. ఇప్పటివరకు పెద్దగా అంతర్జాతీయ అనుభవంలేని విజయ్ శంకర్ ఏకంగా పాకిస్థాన్‌తో మ్యాచ్ ద్వారా వరల్డ్ కప్ అరంగేట్రం చేయనుండటం విశేషం అని చెప్పాలి. ఇక పాక్ జట్టులో షాదాబ్ ఖాన్, ఇమాద్ వాసింలకు చోటు కల్పించారు. 
 
ఇరు జట్ల వివరాలను పరిశీలిస్తే,
 
భారత్ : రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, కోహ్లీ, విజయ్ శంకర్, జాదవ్, ధోనీ, పాండ్యా, కుమార్, కుల్దీప్ యాదవ్, చాహల్, బుమ్రా.
పాకిస్థాన్ : ఫకర్ జమాన్, ఇమామ్ ఉల్ హక్, బాబర్ అజమ్, హఫీజ్, సర్ఫాజ్ అహ్మద్, షోయబ్ మాలిక్, ఇమద్ వాసీం, షదాద్ ఖాన్, హసన్ అలీ, మహ్మద్ అమిర్. 

సంబంధిత వార్తలు

వివేకా హత్య కేసులో రూ.40 కోట్లు చేతులు మారాయ్ : షర్మిల ఆరోపణ

చంద్రబాబు హామీలు కేవలం సైకిల్‌ బెల్స్‌ మాత్రమే..జగన్

మే 13, జూన్ 4 తేదీలకు వేతనంతో కూడిన సెలవులు

కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారంటూ వైఎస్ షర్మిలపై కేసు నమోదు!!

కొణిదెల పవన్ కళ్యాణ్.. అమ్మ కడుపున ఆఖరి వాడిగా పుట్టాడు... తమ్ముడికి చిరంజీవి మద్దతు

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

తర్వాతి కథనం
Show comments