Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓల్డ్ ట్రాఫర్డ్‌లో నీలినీడలు : భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌పై నీలినీడలు?

Webdunia
ఆదివారం, 16 జూన్ 2019 (11:14 IST)
ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా ఆదివారం మాంచెష్టర్‌లోని ఓల్డ్ ట్రాఫర్డ్ స్టేడియంలో భారత్ - పాకిస్థాన్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ ప్రేమికులంతా అమితాసక్తితో ఎదురు చూస్తున్నారు. అయితే, ఈ మ్యాచ్‌పై ఇపుడు నీలి నీడలు కమ్ముకున్నాయి. 
 
గత రాత్రి భారీ వర్షం కురిసి కాస్తంత తెరిపిచ్చినప్పటికీ, ఈ ఉదయం తిరిగి వర్షం పడుతూనే ఉండటంతో ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానం తడిసి ముద్దవుతోంది. గత రాత్రి సూపర్ స్లోపర్లు ఎంతో కష్టపడి, నీటిని తొలగించినా, తిరిగి నీరు చేరింది. దీంతో మరో ఐదు గంటల్లో మ్యాచ్ ప్రారంభం కావాల్సి వుండగా, టాస్ ఆలస్యమయ్యే అవకాశాలున్నాయని గ్రౌండ్ స్టాఫ్ అంచనా వేస్తోంది.
 
పూర్తి మ్యాచ్ సాగే అవకాశాలు నామమాత్రమేనని, వాతావరణం అనుకూలిస్తే, కొన్ని ఓవర్లు కుదించి అయినా మ్యాచ్ సాగవచ్చని వారు అంటున్నారు. అయితే, నేడంతా అప్పుడప్పుడూ జల్లులు కురవవచ్చని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తుండటం గమనార్హం. ఇప్పటికే నాలుగు మ్యాచ్‌లు వాన కారణంగా రద్దు కావడంతో, మ్యాచ్‌ల షెడ్యూల్ పై క్రీడాభిమానులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ, ఐసీసీపై మండిపడుతున్నారు. 

సంబంధిత వార్తలు

స్వాతి మలివాల్‌పై కేజ్రీవాల్ సహాయకుడి దాడి.. ఆ నొప్పిలో వున్నా?

రాత్రంతా మహిళతో మాట్లాడాడు.. రూ. 60 లక్షలు ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాడు...

సంతోషిమాత అమ్మవారికి కేజీ బరువున్న వెండి చక్రం

అమెరికాలో తెలుగు టెక్కీ కారు ప్రమాదం నుంచి తప్పించుకున్నా మరో కారు రూపంలో మృత్యువు

Telangana రిజిస్ట్రేషన్లు ఇకపై TS కాదు TG, ఉత్తర్వులు జారీ

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

తర్వాతి కథనం
Show comments