Webdunia - Bharat's app for daily news and videos

Install App

సర్ఫరాజ్ ఆవలింత ఫోటోను తెగ వాడేస్తున్న సైబరాబాద్ పోలీసులు

Webdunia
శనివారం, 22 జూన్ 2019 (14:25 IST)
పాకిస్థాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ ఫోటోపై సైబరాబాద్ పోలీసులు మనసు పారేసుకున్నారు. దీంతో ఆ ఫోటోను తెగ వాడేస్తున్నారు. ఇంతకీ ఆ ఫోటో ప్రత్యేకత ఏంటనే కదా మీ సందేహం. 
 
ఆ ఫోటోలో సర్ఫరాజ్ అహ్మద్ ఆవలిస్తూ ఉండటమే. ఈ ఫోటో చూసిన సైబరాబాద్ పోలీసులకు ఓ వినూత్న ఆలోచన వచ్చిందే. అంతే.. ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా ఆ ఫోటోను వాడేస్తున్నారు. 
 
నిజానికి రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు ట్రాఫిక్ పోలీసులు సాధారణంగా ప్రకటనలు ఇస్తుంటారు. అందులో సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయవద్దనీ, మద్యం సేవించి వాహనాలు నడపవద్దని సూచిస్తూ ఉంటారు. 
 
కానీ తెలంగాణలోని సైబరాబాద్ పోలీసులు మాత్రం ఇంకాస్త వినూత్నంగా ఆలోచించారు. ఇటీవల ప్రపంచకప్ లో భారత్-పాక్ వన్డే మ్యాచ్ సందర్భంగా పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ ఖాన్ ఆవలిస్తున్న ఫొటోను ఇందుకోసం వాడుకున్నారు.
 
ఓ పేద్ద సైన్ బోర్డును సర్ఫరాజ్ ఫొటోతో డిజైన్ చేయించిన పోలీసులు.. ‘నిద్ర వస్తుంటే దాన్ని ఆపుకుని మరీ డ్రైవింగ్ చేయకండి. అది చాలా డేంజర్’ అని సూచించారు. దీంతో పోలీసుల సెన్స్ ఆఫ్ హ్యూమర్ కు నెటిజన్లు ఫిదా అయిపోయారు. సైబరాబాద్ పోలీసుల ఆలోచన భేష్ అని ప్రశంసలు కురిపిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తోడుకోసం ఆశపడి రూ.6.5 కోట్లు పోగొట్టుకున్న యూపీవాసి!

మడకశిరలో విషాదం : బంగారం వ్యాపారం కుటుంబ ఆత్మహత్య

ద్విచక్రవాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలి : నితిన్ గడ్కరీ!

మయన్మార్ భూకంప తీవ్రత... 334 అణుబాంబుల విస్ఫోటనంతో సమానం!!

కోడిగుడ్లు అమ్ముకునే వ్యాపారి బిజెనెస్ రూ.50 కోట్లు.. జీఎస్టీ చెల్లించాలంటూ నోటీసు!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

తర్వాతి కథనం
Show comments