Webdunia - Bharat's app for daily news and videos

Install App

జడేజా స్థానంలో నేనుంటే పాండ్యాకోసం నా వికెట్ త్యాగం చేసేవాడిని: వీవీఎస్ లక్ష్మణ్ వ్యాఖ్య

కోట్లాది అభిమానలకు షాక్ కలిగిస్తూ టీమిండియా టాపార్డర్ వరుసగట్టి పెవిలియన్‌ దారి పట్టిన నేపథ్యంలో విజయంపై ఆశలు అడుగంటినప్పటికీ పాకిస్తాన్ జట్టుకు చుక్కలు చూపించిన హార్దిక్ పాండ్యా అన్యాయంగా ఔటయిన ఘటనపై అందుకు బాధ్యుడైన జడేజాపై భారత క్రికెట్ దిగ్గజం వ

Webdunia
ఆదివారం, 18 జూన్ 2017 (23:37 IST)
కోట్లాది అభిమానలకు షాక్ కలిగిస్తూ టీమిండియా టాపార్డర్ వరుసగట్టి పెవిలియన్‌ దారి పట్టిన నేపథ్యంలో విజయంపై ఆశలు అడుగంటినప్పటికీ పాకిస్తాన్ జట్టుకు చుక్కలు చూపించిన  హార్దిక్ పాండ్యా అన్యాయంగా ఔటయిన ఘటనపై అందుకు బాధ్యుడైన జడేజాపై భారత క్రికెట్ దిగ్గజం వీవీఎస్ లక్ష్మణ్ విమర్శల వర్షం కురిపించాడు. పాక్ భీకర బౌలింగ్‌ను తుత్తునియలు చేస్తూ సిక్సర్ల వర్షం కురిపిస్తున్న హార్దిక్ పాండ్యా రనౌట్ కాకుండా జడేజా తన వికెట్‌ను త్యాగం చేయాల్సి ఉండెనని వీవీఎస్ లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. ఆ సమయంలో క్రీజులో నేనే ఉంటే పాండ్యాను కాపాడి తాను రనౌట్ అయ్యేవాడినని లక్ష్మణ్ వ్యాఖ్యానించాడు.
 
ఆదివారం ఓవల్‌ మైదానంలో జరిగిన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో 54 పరుగులకే 5 కీలక వికెట్లు కోల్పోయి టీమిండియా టాపార్డర్ షాక్ కలిగించగా, పాక్ అరివీర భయంకర బౌలింగును దునుమాడుతూ టీమిండియా ఆల్ రౌండర్ చుక్కలు చూపించాడు. చాంపియన్స్ ట్రోఫీలో దాయాది పాకిస్తాన్‌తో జరుగుతున్న తుది పోరులో భారత్ జట్టు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన తరుణంలో మిడిల్ ఆర్డర్ ఆటగాడు హార్దిక్ పాండ్యా బ్యాట్ ఝుళిపించాడు. 
 
వరుస సిక్సర్లతో దూకుడును పెంచిన పాండ్యా హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. టాపార్డర్ అంతా విఫలమైన తరుణంలో 32 బంతుల్లో 3 సిక్సర్లు, 3 ఫోర్లతో అర్థ శతకం సాధించాడు. 23 ఓవర్‌లో హ్యాట్రిక్ సిక్సర్ల సాధించడంతో భారత్ స్కోరు బోర్డులో వేగం పెరిగింది. అయితే హార్దిక్ మంచి దూకుడుగా ఉన్న తరుణంలో రవీంద్ర జడేజా చేసిన తప్పిదం వల్ల రనౌట్ అవుటయ్యాడు. హార్దిక్ 43 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్లతో 76 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.
 
54 పరుగులకే ఐదు కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ జట్టును హార్దిక్‌ పాండ్యా (76; 43 బంతుల్లో 4×4, 4×6) ఆదుకొనే ప్రయత్నం చేశాడు. షాబాద్‌ఖాన్‌ వేసిన ఇన్నింగ్స్‌ 23వ ఓవర్లో చెలరేగి ఏకంగా 23 పరుగులు రాబట్టాడు. తొలి మూడు బంతుల్ని వరుసగా స్టాండ్స్‌లోకి పంపి హ్యాట్రిక్‌ సిక్సర్లు బాదేసి అర్ధశతకం పూర్తిచేశాడు. ఆ ఓవర్‌లో వరుసగా 6,6,6,0,4,1 పరుగులు వచ్చాయి. 
 
పాండ్యాకు సహకారం అందించిన జడేజా చివరికి అద్బుత ప్రదర్శన చేస్తున్న పాండ్యాను సులభంగా రనౌట్ చేసి టీమిండియాలో పరాజయంలో తవవంతు దోహదం అందించేశాడు. ఫీల్డర్ సమీపంలో బంతి ఉండగా పరుగెత్తవద్దని పాండ్యాకు చెప్పకుండా తీరా అతడు క్రీజు దాటి సగం దూరం వచ్చాక రావద్దని సూచిస్తూ తాను తన క్రీజుకు చేరుకోవడం ద్వారా జడేజా అనవసరంగా పాండ్యాను రనౌట్ చేశాడు. 
 
బౌలింగులో ధారాళంగా పరుగులిచ్చిన జడేజా... తన వికెట్ కాపాడుకోవడానికి పాండ్యాను బలి చేసిన ఘటనపై వీవీఎస్ లక్ష్మణ్‌తో పాటు టీమిండియా అభిమానులు మండిపడుతున్నారు. తన రనౌట్ విషయంలో జడేజా వైఖరిపై తీవ్రంగా ఆగ్రహించిన పాండ్యా మైదానంలో బూతులు తిట్టుకుంటూ బయటకు వెళ్లడం స్పష్టంగా కనిపించింది. 
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఉగ్రవాదులకు, వారికి మద్దతునిచ్చేవారికి ఊహించని శిక్ష విధిస్తాం : ప్రధాని మోడీ

బస్సులో మైనర్ బాలికపై లైంగిక వేధింపులు: సీసీటీవీ కెమెరాలు పనిచేయట్లేదు

Hindupur woman: కుమార్తె వీడియోతో రూ.60లక్షలు దోచేసుకున్నారు..

Pakistan Government X: భారత్‌లో పాక్ ఎక్స్ అకౌంట్‌పై సస్పెన్షన్ వేటు

పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో తిరుమలలో హై అలెర్ట్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను పాకిస్థాన్ అని ఎవరు చెప్పారు...: నెటిజన్లకు ఇమాన్వీ ప్రశ్న

బాలీవుడ్ నటి వాణి కపూర్‌కు వార్నింగ్ ఇచ్చిన నెటిజన్లు.. దెబ్బకి దిగివచ్చిన భామ!

ప్రభాస్‌కు కొత్త తలనొప్పి : ఆ హీరోయిన్‌ను తొలగించాల్సిందేనంటూ డిమాండ్!

Priyadarshi: సారంగపాణి జాతకం ఎలావుందో తెలిపే థీమ్ సాంగ్ విడుదల

Nani: నాని తదుపరి సినిమా దర్శకుడు సుజీత్ గురించి అప్ డేట్

తర్వాతి కథనం
Show comments