Webdunia - Bharat's app for daily news and videos

Install App

మిథాలి రాజ్ ప్రపంచ రికార్డు, పూనమ్ సెంచరీ వృధా.. మహిళలూ ఓడారు

క్వార్టర్ ఫైనల్ వరకూ విజయాలతో వచ్చి సెమీస్‌లోనూ, ఫైనల్లోనూ చేతులెత్తేసే రోగం టీమిండియా పురుషుల జట్టుకే కాకుండా మహిళా జట్టుకు కూడా వాడుకగా మారుతోందా.. ఐసీసీ మహిళల ప్రపంచకప్‌లో మిథాలీ సేనకు వరుసగా రెండో పరాజయం ఎదురైంది. దక్షిణాఫ్రికా చేతిలో భంగపడిన భార

Webdunia
గురువారం, 13 జులై 2017 (08:41 IST)
క్వార్టర్ ఫైనల్ వరకూ విజయాలతో వచ్చి సెమీస్‌లోనూ, ఫైనల్లోనూ చేతులెత్తేసే రోగం టీమిండియా పురుషుల జట్టుకే కాకుండా మహిళా జట్టుకు కూడా వాడుకగా మారుతోందా.. ఐసీసీ మహిళల ప్రపంచకప్‌లో మిథాలీ సేనకు వరుసగా రెండో పరాజయం ఎదురైంది. దక్షిణాఫ్రికా చేతిలో భంగపడిన భారత్‌... తాజాగా ఆస్ట్రేలియా చేతిలోనూ దారుణ పరాజయం చవిచూసింది. భారత ఓపెనర్‌ పూనమ్‌ రౌత్‌ సెంచరీతో అదరగొట్టినా... మిథాలీ రాజ్‌ వన్డే క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా చరిత్ర సృష్టించినా... తుది ఫలితం మాత్రం భారత్‌ను నిరాశపరిచింది. 
 
కీలకమైన మ్యాచ్‌లలో రెండు పరాజయాలను మూడగట్టుకున్న  మిథాలీ సేనకు ఈ ఓటమితో సెమీస్‌ బెర్త్‌  క్లిష్టమైంది. న్యూజిలాండ్‌తో ఈనెల 15న జరిగే చివరి లీగ్‌ మ్యాచ్‌ ఫలితంపైనే టీమిండియా సెమీఫైనల్‌ అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టుకు సెమీస్‌ స్థానం ఖాయమవుతుంది. ఒకవేళ వర్షం వల్ల రద్దయితే మాత్రమే భారత్‌ సెమీస్‌కు చేరుకుంటుంది.   
 
ఐసీసీ మహిళల ప్రపంచకప్‌లో మిథాలీ సేనకు వరుసగా రెండో పరాజయం ఎదురైంది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో భారత్‌పై జయభేరి మోగించి సెమీఫైనల్‌కు చేరింది. మొదట భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది. పూనమ్‌ రౌత్‌ (136 బంతుల్లో 106; 11 ఫోర్లు) సెంచరీతో కదం తొక్కింది. కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ (114 బంతుల్లో 69; 4 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించింది. తర్వాత ఆస్ట్రేలియా 45.1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 227 పరుగులు చేసి గెలిచింది. మెగ్‌ లానింగ్‌ (88 బంతుల్లో 76 నాటౌట్‌; 7 ఫోర్లు, 1 సిక్స్‌) కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో గెలిపించింది. ఎలీస్‌ పెర్రీ (67 బంతుల్లో 60 నాటౌట్‌; 8 ఫోర్లు) కూడా బాధ్యతాయుతంగా ఆడింది.
 
బ్యాటింగ్‌లో భారత బ్యాట్స్‌మెన్‌ చేతులెత్తేశారు. ఓపెనర్‌ పూనమ్‌ రౌత్, కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ మినహా ఇంకెవరూ బాధ్యత తీసుకోలేదు.  తొలి రెండు మ్యాచ్‌ల్లో అసాధారణ ఆటతీరు కనబరిచిన స్మృతి మంధన (3) వరుసగా నాలుగో మ్యాచ్‌లోనూ సింగిల్‌ డిజిట్‌కే పరిమితమైంది. 9 పరుగులకే వికెట్‌ కోల్పోయిన భారత ఇన్నింగ్స్‌ను పూనమ్, మిథాలీ చక్కదిద్దారు. మరో వికెట్‌ కోల్పోకుండా జట్టు స్కోరును 100 పరుగులకు చేర్చారు. ఈ క్రమంలో ఇద్దరూ అర్ధసెంచరీలు పూర్తి చేసుకున్నారు. జట్టు స్కోరు 166 పరుగుల వద్ద మిథాలీ... బీమ్స్‌కే రిటర్న్‌ క్యాచ్‌ ఇచ్చి నిష్క్రమించింది. సెంచరీ పూర్తయ్యాక పూనమ్‌ రౌత్‌ ఔట్‌ కాగా... ఆ తర్వాత వచ్చిన వారిలో హర్మన్‌ప్రీత్‌ (23) రెండంకెల స్కోరు చేసింది. వేద (0), సుష్మ (6), జులన్‌ గోస్వామి (2) నిరాశపరిచారు.
 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments