Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాముపడగను కొట్టా: కోహ్లీ వికెట్ తీయడంపై నాథన్ లియోన్ సంబరం

పాము పడగ లాంటి విరాట్ కోహ్లీ వికెట్‌ను తీసినందుకు తనకు సంబంరంగా ఉందని ఆసీస్ట్ స్పిన్నర్ నాథన్ లియోన్ చెప్పాడు. శనివారం బెంగళూరులో జరిగిన రెండో టెస్టులో 50 పరుగులకు 8 వికెట్లు తీసిన కెరీర్ బెస్ట్‌గా రికార్డు సృష్టించిన లియాన్ షాట్ కొట్టి అవుటయ్యే అవకా

Webdunia
ఆదివారం, 5 మార్చి 2017 (06:12 IST)
పాము పడగ లాంటి విరాట్ కోహ్లీ వికెట్‌ను తీసినందుకు తనకు సంబంరంగా ఉందని ఆసీస్ట్ స్పిన్నర్ నాథన్ లియోన్ చెప్పాడు. శనివారం బెంగళూరులో జరిగిన రెండో టెస్టులో 50 పరుగులకు 8 వికెట్లు తీసిన కెరీర్ బెస్ట్‌గా రికార్డు సృష్టించిన లియాన్ షాట్ కొట్టి అవుటయ్యే అవకాశం ఇవ్వకుండా కోహ్లీతప్పు చేశాడన్నాడు. అత్యుత్తమ ఆటగాడిపై తలపడాలని ఎవరైనా కోరుకుంటారని, ప్రపంచంలోనే ఉత్తమ ఆటగాళ్లలో ఒకడైన కోహ్లీ దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్స్ మాట్లల్లో చెప్పాలంటే పాముపడగలాంటివాడని అలాంటి అత్యుత్తమ ఆటగాడి వికెట్ తీయడం సంబరంగా ఉందని లియాన్ పేర్కొన్నాడు. 
 
కోహ్లీ వికెట్ తీయడం అసాధారణమైన ఫీట్ కావచ్చు కాని ఈ సీరీస్ భారీ స్థాయిలో కొనసాగుతుందని మాకు తెలుసని, కోహ్లీ తిరిగి పుంచుకుంటాడని తాము భావిస్తున్నామని లియాన్ చె్ప్పాడు. లంచ తర్వాత కోహ్లీని ఔట్ చేసిన విధంపై అడిగినప్పుడు కోహ్లీ తొలి టెస్టులోనూ అదే తప్పు చేశాడు, రెండో టెస్టులోనూ అదే తప్పు చేశాడని అన్నాడు. నేను వేసిన బంతి ఏమంత ప్రత్యేకమైనది కాదు. అతడి వికెట్ తీయడంలో మేం అదృష్టవంతులం. కాని విరాట్ కోహ్లీ ప్రపంచస్థాయి ప్లేయర్ అతడు ఖచ్చితంగా పుంజుకుంటాడు.  ఏదేమైనా ఆస్ట్లేలియాకు ఇది ఒక గొప్పదినమని లియాన్ పేర్కొన్నాడు. 
 
భారత్‌తో జరిగిన సెకండ్ టెస్ట్ మ్యాచ్ మొదటి రోజు ఆస్ట్రేలియా బౌలర్ నాథన్ లియాన్ 50 పరుగులు మాత్రమే ఇచ్చి 8 వికెట్లు పడగొట్టిన సంగతి తెలిసిందే. అయితే మొదటి రోజు ఆట ముగిసిన తర్వాత లియాన్ మీడియాతో మాట్లాడుతూ తాను ఈ విధంగా కొంతసేపు నవ్వడం ఇదే మొదటిసారని చెప్పాడు. తాను స్పిన్ కోచ్ జాన్ డావిసన్‌తో కలిసి బాగా హార్డ్ వర్క్ చేశానని తెలిపాడు. ఈ రోజు మ్యాచ్‌లో తన  బౌలింగ్‌లో చివరి గంట బాగా కలిసొచ్చిందని చెప్పాడు. భారత పర్యటనకు రావడానికి ముందు అశ్విన్, జడేజాల బౌలింగ్ వీడియోలను బాగా పరిశీలించానని చెప్పాడు. అయితే తన బలాలను గుర్తించి వాటిపైనే దృష్టి పెట్టానని చెప్పాడు. అంతే కాక ఇక్కడకు రావడానికి ముందు దుబాయ్‌లో బాగా కష్టపడ్డానని, సుమారు 1200 బంతుల వరకూ అక్కడ ప్రాక్టీస్ చేశానని చెప్పాడు. అందరం కూర్చుని భారత్‌ను ఏ విధంగా ఎదుర్కోవాలనే దానిపై చర్చించేవాళ్లమని వివరించాడు లియాన్.
 
టెస్టుల్లో రెండు వందల పరుగుల లోపే ఆలౌటవ్వడంలో టీమిండియా మరోసారి పరాభవాన్ని ఎదుర్కొంది. వరుసగా మూడు ఇన్నింగ్స్‌లలో 200లోపే ఆలౌటై 1977 తర్వాత మళ్లీ ఇప్పుడే చెత్త రికార్డ్‌ను తిరిగి నమోదు చేసింది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న సెకండ్ టెస్ట్ మ్యాచ్ మొదటి రోజున భారత జట్టు తన ఫస్ట్ ఇన్నింగ్స్‌ను 189 పరుగులకే ముగించిన సంగతి తెలిసిందే. మొదటి టెస్ట్‌లో కూడా రెండు ఇన్నింగ్స్‌లలో వరుసగా 105, 107 పరుగులకే భారత జట్టు ఆలౌటయ్యింది. అయితే సొంతగడ్డపై ఇలా వరుసగా మూడు సార్లు 200లోపే ఆలౌట్ కావడం 1977 తర్వాత మళ్లీ ఇప్పుడే జరిగింది. అప్పట్లో ఇంగ్లండ్ జట్టుపై భారత జట్టు వరుసగా నాలుగు ఇన్నింగ్స్‌లలో హోం గ్రౌండ్‌లో రెండు వందల పరుగల లోపే ఆలౌటయ్యింది. దీంతో దాదాపు 40 ఏళ్ల తర్వాత టీమిండియాకు మళ్లీ అలాంటి పరాభవం ఎదురయ్యింది. 
 
బెంగళూరు భారత్‌తో జరిగిన సెకండ్ టెస్ట్ మ్యాచ్ మొదటి రోజు ఆస్ట్రేలియా బౌలర్ నాథన్ లియాన్ 50 పరుగులు మాత్రమే ఇచ్చి 8 వికెట్లు పడగొట్టిన సంగతి తెలిసిందే. అయితే తొలి రోజు ఆట ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ విజయ రహస్యాలను వివరించాడు. తాను ప్రతి మ్యాచ్‌లో బౌలింగ్ వేయడానికి ముందుగా ఒక గంటపాటు ప్రాక్టీస్ చేస్తానని చెప్పాడు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

KTR: కేటీఆర్‌‌కు ఓ స్వీట్ న్యూస్ ఓ హాట్ న్యూస్.. ఏంటది?

గంటలో శ్రీవారి దర్శనం.. ఎలా? వారం రోజుల పాటు పైలెట్ ప్రాజెక్టు!

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం... ఉత్తారంధ్రకు భారీ వర్ష సూచన!

మీసాలు తిప్పితే రోడ్లు పడవు : మీ కోసం పని చేయనివ్వండి .. పవన్ కళ్యాణ్

హనీమూన్‌కు ఎక్కడికి వెళ్లాలి.. అల్లుడుతో గొడవు.. మామ యాసిడ్ దాడి!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సాయిపల్లవి, విజయ్ సేతుపతికి అవార్డులు.. ఏంటవి?

వంద అడుగుల ఎత్తు ఎన్టీఆర్‌ విగ్రహానికి అనుమతిచ్చిన రేవంత్ రెడ్డి

నటిగా ఛాలెంజింగ్ పాత్ర డ్రింకర్ సాయి లో పోషించా : ఐశ్వర్య శర్మ

Sriya Reddy: పవన్ కళ్యాణ్ గురించి శ్రియా రెడ్డి ఏమన్నారంటే..?

నేనూ మనిషినే.. ఆరోగ్య సమస్యలు సహజం : శివరాజ్ కుమార్

తర్వాతి కథనం
Show comments