Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రత్యర్థికి టోర్నీలో ఎన్నడూ తలవంచలేదు..జట్టును చూసి గర్విస్తున్నా: కంట తడి పెట్టుకున్న మిథాలి రాజ్

గత 18 ఏళ్లుగా అలుపెరుగకుండా భారత జట్టుకు బ్యాట్స్ విమెన్‌గా, కెప్టెన్‌గా సేవలందించిన మిథాలీరాజ్ వరల్డ్ కప్ ఫైనల్లో ఊహించని పరాజయంతో విషణ్ణవదనురాలయింది. ఆ కళ్లలో ఎన్నడూ చూడని తడి. ఒక్క నిమిషమే. అంతలోనే కెప్టేన్‌గా ఆమె నేర్చుకున్న స్థితప్రజ్ఞత ఒక్కసారి

Webdunia
సోమవారం, 24 జులై 2017 (00:46 IST)
ఐసీసీ మహిళా ప్రపంచ కప్ చరిత్రలోనే  ఇంత ఉత్కంఠ భరితంగా జరిగిన పైనల్‌ని చూడలేదు. గెలుపు తప్పక భారత అమ్మాయిలదే అనిపించిన క్షణంలోనే ఏదో మాయ జరిగనట్లుగా ఇంగ్లండ్ బౌలర్‌ అన్యా ష్రుబ్‌సోల్ మాయ చేసింది. ఫలితం.. 191 పరుగులుకు 3 వికెట్లు మాత్రమే కోల్పోయి పటిష్టంగా ఉన్న టీమిండియా మహిళా జట్టు పేకమేడలా కూలిపోయింది. టోర్నీలో ఇంత ఉత్కంఠభరితంగా జరిగిన ఆటను చూడలేదు. ఎంత గొప్ప ఫైనల్‌ని మనం చూశాం. ఇంతకంటే మించిన మంచి గేమ్‌ని మనమెక్కడా చూడలేం. విజయం మీద పూర్తి నమ్మకంతో ఉన్న ఇండియా తన కళ్లముందే అన్యా బౌలింగ్ ధాటికి విజయాన్ని చేజార్చుకుంది.
 
గత 18 ఏళ్లుగా అలుపెరుగకుండా భారత జట్టుకు బ్యాట్స్ విమెన్‌గా, కెప్టెన్‌గా సేవలందించిన మిథాలీరాజ్ వరల్డ్ కప్ ఫైనల్లో ఊహించని పరాజయంతో విషణ్ణవదనురాలయింది. ఆ కళ్లలో ఎన్నడూ చూడని తడి. ఒక్క నిమిషమే. అంతలోనే కెప్టేన్‌గా ఆమె నేర్చుకున్న స్థితప్రజ్ఞత ఒక్కసారిగా ఆమెను విషాదం నుంచి బయటపడేసింది. ఎంత బాగా ఆడినా ఒక జట్టే గెలుస్తుందని దశాబ్దంపైగా నేర్చుకున్న పాఠం తట్టి లేపింది. సునాయాసంగా గెలుపు ముంగిటికి దూసుకువచ్చి కూడా కొద్దిలో వరల్డ్ కప్ ట్రోపీని తనకు అందకుండా చేసిన క్షణాలకు బాధపడుతూనే.. 
టీమ్ మేట్స్‌ని చూసి గర్వపడుతున్నానంది. 
 
నిజంగానే నేను గర్వపుడుతున్నాను. ఇంగ్లండ్‌కు గెలుపు అంత సులభంగా రాలేదు. కానీ వారు ఒత్తిడిని అధిగమించి చివరి వరకూ విజయం కోసం ప్రయత్నించినందుకు వారికే పూర్తిగా క్రెడిట్ దక్కాలి. మ్యాచ్ దాదాపుగా సమతూకంగానే ఉంది. కాని చివర్లోనే తడబడ్డాం. తోటి ప్లేయర్లను చూసి గర్విస్తున్నా. టోర్నీ మొత్తంలో ప్రత్యర్థికి అంత సులువుగా విజయాన్ని వీరు దక్కనివ్వలేదు. మహిళా క్రికెట్ కప్ ఫైనల్‌వరకూ మా వెన్నంటి నిలిచిందుకు ప్రేక్షకులకు కూడా  కృతజ్ఞతలు. మీరిచ్చిన ఈ ప్రోత్సాహం మహిళా క్రికెటర్లందరికీ ఉత్తేజాన్ని కలిగిస్తుంది. జులన్ అనుభవజ్ఞురాలైన బౌలర్. టీమ్‌కు అవసరమైన ప్రతిసారీ ఆమె చక్కటి ప్రతిభ చూపిస్తూ వస్తుంది. నిజంగా ఆమె మ్యాచ్‌ని గెలిపించే సామర్థ్యాన్ని ప్రదర్శించింది. 
 
కానీ ఇంగ్లండ్ బలమైన జట్టు.  భారత జట్టులోని యువ ప్లేయర్లు తమ అత్యుత్తమ ఆటను ప్రదర్శించారు. ఈ వరల్డ్ కప్‌లో పొందిన ఈ అనుభవం తప్పక వారికి తోడ్పడుతుంది. ఒక్కటి మాత్రం నిజం. ఆట ముగిశాక ఇంటికి వెళుతున్న  ప్రేక్షకులు, అభిమానులు మహిళా క్రికెట్ గురించి తమ దృక్పథాన్ని పూర్తిగా మార్చుకుంటారు. నా వరకైతే మరికొన్నేళ్లు జట్టులో తప్పక ఆడతానని నమ్మకముంది. కానీ వచ్చే ప్రపంచ కప్ ఆడగలని అనుకోవడం లేదు. అంటూ మిథాలీ ఆట ముగిశాక చెప్పింది.
 
ఆట ముగిశాక రన్నరప్ మెడల్స్ తీసుకోవడానికి వెళుతున్న భారత మహిళా జట్టు సభ్యుల్లో నెత్తురు చుక్కలేకపోవడం స్పష్టంగా కనిపించింది. ప్రతి ఒక్కరి గుండె బద్దలైన స్థితి. కాని వారు ఓడిపోయినా మైదానంలోని 25 వేలమంది ప్రేక్షకులు మనస్ఫూర్తిగా వారికి మద్దతివ్వడం గొప్పవిషయం. టోర్నీ ప్రారంభం నుంచి అభిమానులు అందించిన ప్రోత్సాహం అభినందనీయం. 
 
టీమిండియా చూపిన తెగువ, స్థైర్యం పడ్ల ఇంగ్లండ్ కెప్టెన్ హెదర్ నైట్ సైతం ప్రశంసలు కురిపించింది. మా వాళ్లు అసాధారణంగా ఆడారు. సందేహం లేదు. ఆరు వికెట్లు పడగొట్టిన అన్యా ష్రుబ్ సోల్ నిజంగా హీరో. ఎంత గొప్ప రోజిది. భారతీయ మహిళలు అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. పూనమ్ బ్యాటింగ్ సూపర్బ్. వాళ్లు కొన్ని మంచి భాగస్వామ్యాలు నిర్మించారు. చివర్లో ఒత్తిడిని అధిగమించలేకపోయారు అని ఇంగ్లండ్ కెప్టెన్ పేర్కొంది. వాస్తవంగానే వేదా కృష్ణమూర్తి ఔట్ కావడమే టీమిండియాకు ప్రమాద ఘంటికలు మోగించింది. దీప్తి శర్మకు బదులు సుష్మా వర్మను ముందుగా పంపడమే తప్పు నిర్ణయంగా మారింది. ఆమెను సులభంగా ఔట్ చేయడం ద్వారా ఇంగ్లండ్ భారత్‌పై ఒత్తిడిని పెంచే అవకాశాన్ని చేజిక్కించుకుంది. అదే భారత్ కొంప ముంచింది కూడా.
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

మోడీ నా‌పై‌ చూపే అభిమానం.. ఆప్యాయత ఎంతో విలువైనది...

ఆపరేషన్‌ బుడమేరు: విజయవాడను వరద ముంపు నుంచి తప్పించే ఈ ప్రాజెక్ట్ ఎప్పటికి పూర్తవుతుంది, ఆక్రమణల మాటేంటి?

మహారాష్ట్ర సీఎం అభ్యర్థిపై ఎంపికపై వీడని ఉత్కంఠ - హస్తినకు ఆ ముగ్గురు నేతలు

మెట్టు దిగిన ఏక్‌నాథ్ షిండే.. బీజేపీ అధిష్టానం నిర్ణయమే శిరోధార్యం

హిందూ - ముస్లింల మధ్య చిచ్చు పెట్టడానికి బీజేపీ కుట్ర : రాహుల్ గాంధీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాబిన్‌హుడ్ తో ఈ క్రిస్మస్ మాదే : హీరో నితిన్

శ్రీ గాంధారిగా భయపెట్టించేందుకు వస్తున్న హన్సిక

ముఫాసా: ది లయన్ కింగ్ నుంచి ముఫాసా ప్రయాణంతో షారుఖ్ ఖాన్

వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ లపై వెన్నెల రాత్రి నేపథ్యంలో సాంగ్ చిత్రీకరణ

వెన్నెల కిషోర్, మోనికా చౌహాన్, కమల్ కామరాజు ల‌ ఒసేయ్ అరుంధతి

తర్వాతి కథనం
Show comments