Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒకే ఒక్కడు కుల్దీప్.. ధోనీ అద్భుత స్టింపింగ్.. కివీస్ రెండో వన్డేలో..

Webdunia
శనివారం, 26 జనవరి 2019 (18:25 IST)
కివీస్‌తో జరిగిన రెండో వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. తద్వారా ఐదు వన్డే సిరీస్‌లో భారత్ 2-0 తేడాతో ఆధిక్యంలో నిలిచింది. రెండు వన్డేల్లోనూ భారత బౌలర్లు చెలరేగిపోయారు. టీమిండియా బౌలర్లను ఎదుర్కోవడంలో కివీస్ బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. ముఖ్యంగా కుల్దీప్ బౌలింగ్‌ను ఆడటంలో చేతులెత్తేశారు. 
 
తొలి వన్డేలో 39 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టిన కుల్దీప్ యాదవ్.. రెండో వన్డేలోనూ మెరుగ్గా రాణించాడు. రెండో వన్డేలో 45 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. తద్వారా కివీస్ గడ్డపై వరుసగా రెండు వన్డేల్లో నాలుగేసి వికెట్లు పడగొట్టిన తొలి స్పిన్నర్‌గా కుల్దీప్ రికార్డ్ సృష్టించాడు.
 
ఇక ఈ ఇదే మ్యాచ్‌లో ధోనీ అద్భుత స్టింపింగ్ చేశాడు. కివీస్‌తో జరిగిన రెండో వన్డే 18 ఓవర్ వేసిన జాదవ్... తొలిబంతిని కాస్త తక్కువ వేగంతో విసరడంతో కివీస్ బ్యాట్స్‌మెన్ టేలర్ సరిగ్గా అంచనా వేయలేకపోయాడు. బంతిని కొట్టేద్దామనుకునేలోపే.. ధోనీ చేతిలో బంతి పడటం.. క్షణాల్లో వికెట్ రాలడం జరిగిపోయింది. 
 
టేలర్‌ను అవుట్ చేయడం ద్వారా మహేంద్ర సింగ్ ఖాతాలో 119వ స్టంపింగ్ చేరింది. ఈ క్రమంలో 337 వన్డేలు ఆడిన ధోనీ 311 క్యాచ్ ఔట్లు, 119 స్టంపింగ్‌లు చేశాడు. అత్యధికంగా 520 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన వికెట్ కీపర్ ధోనీయే కావడం విశేషం. దీంతో అత్యుత్తమ వికెట్ కీపర్ల జాబితాలో కుమార సంగక్కర, గిల్ క్రిస్ట్ తర్వాతి స్థానంలో ధోనీ కొనసాగుతున్నాడు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments