Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాక్‌పై గెలిస్తే.. గొప్ప గౌరవమే కాదు.. గంగా నదిలో మునిగినంత పుణ్యం: సిద్ధూ

ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్‌తో మ్యాచ్‌ సందర్భంగా టీమిండియాకు శుభాశీస్సులు అందజేసిన భారత మాజీ క్రికెటర్‌, పంజాబ్‌ మంత్రి నవజ్యోత్‌ సింగ్‌ సిద్దూ దాయాదుల సంగ్రామంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మ్యాచ్‌లో టీమిండియా కనుక పాకిస్థాన్‌ జట్టును ఓడిస్తే..

Webdunia
ఆదివారం, 4 జూన్ 2017 (18:24 IST)
ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్‌తో మ్యాచ్‌ సందర్భంగా టీమిండియాకు శుభాశీస్సులు అందజేసిన భారత మాజీ క్రికెటర్‌, పంజాబ్‌ మంత్రి నవజ్యోత్‌ సింగ్‌ సిద్దూ దాయాదుల సంగ్రామంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  ఈ మ్యాచ్‌లో టీమిండియా కనుక పాకిస్థాన్‌ జట్టును ఓడిస్తే.. అది టీమిండియాకు గొప్ప గౌరవమవుతుందని, పవిత్ర గంగానదిలో మునిగినంతా పుణ్యం కలుగుతుందని చమత్కరించారు.
 
'పాకిస్థాన్‌పై విజయం సాధించడం నిజంగా గొప్ప గౌరవం. పాకిస్థాన్‌తో క్రికెట్‌ మ్యాచ్‌లో గెలిస్తే గంగానదిలో మునిగి సకల పాపాలన్నీ కడిగేసుకున్నట్టే' అని ఆయన వ్యాఖ్యానించారు. చాంపియన్స్‌ ట్రోఫీలో భాగంగా ఆదివారం జరుగుతున్న దాయాదుల సమరాన్ని సరిహద్దులకు ఇరువైపులా ఉన్న క్రికెట్‌ ఫ్యాన్స్‌ ఉత్కంఠగా వీక్షిస్తున్న నేపథ్యంలో సిద్దూ ఈ వ్యాఖ్యలు చేశారు.
 
సిద్ధూ చేసిన ఈ ఒక్క వ్యాఖ్య పాక్‌తో క్రికెట్ సమరాన్ని భారత అభిమానులు ఏ స్థాయిలో చూస్తున్నారో అర్థమవుతుంది. కానీ భావోద్వేగాలను ఈ స్థాయిలో ప్రకటించడం ఇరుదేశాల మధ్య సంబంధాలను మరింత దిగజార్చుతుందేమో ఆలోచించాలి.
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Jagan: ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలి: జగన్మోహన్ రెడ్డి డిమాండ్

బీహార్‌‌లో గోపాల్ ఖేమ్కా హత్య.. కారులో దిగుతుండగానే కాల్చి చంపేశారు..

రూ.1 కోటి విలువైన 1,000 దొంగలించబడిన మొబైల్ ఫోన్లు స్వాధీనం

అర్జెంటీనాకు చేరుకున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. 57 సంవత్సరాల తర్వాత..? (video)

హిమాచల్ ప్రదేశ్- ఉత్తరాఖండ్‌లలో భారీ వర్షాలు.. 130మందికి పైగా మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kartik Aaryan- Sreeleela: కార్తీక్ ఆర్యన్‌తో శ్రీలీల ప్రేమాయణం? డిన్నర్‌కు? (video)

రామాయణం: సీత పాత్రకు సాయి పల్లవి యాప్ట్ కాదంటోన్న నెటిజన్లు.. ట్రోల్స్ మొదలు

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

తర్వాతి కథనం
Show comments