Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోహ్లీ పట్టుదలకు తలొగ్గి కుంబ్లేని తప్పిస్తే రేపు మరొక కోచ్ పరిస్థితి ఏమిటి? బీసీసీఐ మల్లగుల్లాలు

భారత క్రికెట్ మండలి బీసీసీఐ తన చరిత్రలో కనీవినీ ఎరుగని సంక్షోభాన్ని అనిల్ కుంబ్లే రూపంలో ఎదుర్కొంటోంది. అంటే కుంబ్లే ఘోరాపరాధం చేసి బీసీసీఐకి మచ్చ తెచ్చాడని కాదు. కోచ్‍‌గా కుంబ్లే వైఖరి పట్ల విసిగిపోయిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎట్టిపరిస్థితి

Webdunia
మంగళవారం, 20 జూన్ 2017 (03:00 IST)
భారత క్రికెట్ మండలి బీసీసీఐ తన చరిత్రలో కనీవినీ ఎరుగని సంక్షోభాన్ని అనిల్ కుంబ్లే రూపంలో ఎదుర్కొంటోంది. అంటే కుంబ్లే ఘోరాపరాధం చేసి బీసీసీఐకి మచ్చ తెచ్చాడని కాదు. కోచ్‍‌గా కుంబ్లే వైఖరి పట్ల విసిగిపోయిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎట్టిపరిస్థితిలోనూ కుంబ్లేని కోచ్‌గా కొనసాగించరాదని బీసీసీఐ సలహా కమిటీకి సీరియస్‌గా చెప్పేయడంతో ఏంచేయాలో తోచక బీసీసీఐ తల పట్టుకున్నట్లు సమాచారం. 
 
ఇంగ్లండ్ మీడియా వార్తల ప్రకారం టీమిండియా సారథి విరాట్‌కోహ్లీ శనివారం సాయంత్రం గంగూలీ, సచిన్‌, లక్ష్మణ్‌, బీసీసీఐ తాత్కాలిక కార్యదర్శి అమితాబ్‌ చౌదరి, సీఈవో రాహుల్‌ జోహ్రీ, క్రికెట్‌ జీఎం డాక్టర్‌ ఎంవీ శ్రీధర్‌ను కలిశాడు. గంటపాటు జరిగిన సమావేశంలో కుంబ్లే పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ ఘటనతో ఇద్దరి మధ్య ఎడబాటు చాలా దూరం వెళ్లినట్లు అర్ధమవుతోంది. దీంతో కుంబ్లేతో మాట్లాడి అటు వైపు నుంచి ఎలాగైనా సయోధ్య కుదుర్చాలని సలహా సంఘం తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
 
ప్రస్తుత కోచ్‌ కుంబ్లే కొనసాగింపు పట్ల తన వ్యతిరేక వైఖరిని గంగూలీ, సచిన్‌, లక్ష్మణ్‌తో కూడిన బృందానికి టీమిండియా సారథి విరాట్‌కోహ్లీ గట్టిగానే వినిపించినట్లు సమాచారం. కుంబ్లేను త్వరలో కలవనున్న దృష్ట్యా గంగూలీ బృందం వద్ద సమాధానాలు లేని ప్రశ్నలు చాలా మిగిలిపోయినట్లు తెలుస్తోంది. ‘కోచ్‌గా కుంబ్లే ట్రాక్‌ రికార్డు చాలా బాగున్నప్పుడు అతడిని ఎవరు ఏ ప్రాతిపదికన ఎందుకు తొలగించాలి కోహ్లీ గొప్ప ఆటగాడు, సత్తా ఉన్న క్రికెటర్‌ ఐనప్పటికీ ఎంపిక బాధ్యత అతడికి అప్పగించాలా వచ్చే కొత్త కోచ్‌తోనూ కోహ్లీ విభేదాలు తలెత్తితే అప్పుడూ ఇలాగే తొలగించాలా సెహ్వాగ్‌ కోచ్‌ పదవికి దరఖాస్తు చేశాడు. అతడితోనూ వారాలు, నెలల వ్యవధిలోనే విభేదాలు వస్తే ఏం చేయాలి’ అని సలహా కమిటీ తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. 
 
లండన్‌ నూతన కోచ్‌ ఎంపిక ప్రక్రియలో తలమునకలై ఉన్న బీసీసీఐ క్రికెట్‌ సలహా సంఘానికి మరో తలనొప్పి వచ్చిపడింది. ప్రస్తుత కోచ్‌ కుంబ్లే కొనసాగింపు పట్ల తన వ్యతిరేక వైఖరిని గంగూలీ, సచిన్‌, లక్ష్మణ్‌తో కూడిన బృందానికి టీమిండియా సారథి విరాట్‌కోహ్లీ గట్టిగానే వినిపించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సలహా సంఘం సందిగ్ధంలో పడినట్లు తెలుస్తోంది!
 
కెప్టెన్ కోచ్‌పై ఆరోపణలు చేస్తేనే ఏం చేయాలన్న సందిగ్ధంలో పడిపోయిందంటే బీసీసీ డేరింగ్ నిర్ణయాలను తీసుకునే చేవ కోల్పోయిందని అర్థం. 30 ఏళ్ల క్రితం కపిల్ దేవ్ రిటైర్ అయిన తర్వాత కొత్త కెప్టెన్ కె. శ్రీకాంత్ జట్టును కూడగట్టుకుని బీసీసీఐ నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యవహరించాడన్న కారణంతో అతి కొద్ది కాలంలోనే అతడికి ఉద్వాసన పలికిన బీసీసీఐ  ఒక దిగ్గజ బౌలర్ కమ్ కోచ్‌పై తిరగబడిన కోహ్లీని కట్టడి చేయలేకపోవడం, కుంబ్లేనే సంప్రదించాలనుకోవడం బీసీసీఐలో చేవలేనితనాన్ని బట్టబయలు చేస్తోంది.
 
అందుకే రేపు వీరేంద్ర సెహ్వాగ్ కోచ్‌గా ఎన్నికైతే కోహ్లీకి అతడిమీద కూడా కోపమొస్తే ఏంటన్నది నిజంగానే సమస్యగా మారనుంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

సివిల్ కేసుల్లో పోలీసుల జోక్యమా: కోర్టు అసహనం

నాకు దక్కని ఆమె మరెవ్వరికీ దక్కకూడదు .. ప్రియుడి కిరాతక చర్య

తెలంగాణ సర్కారు గుడ్ న్యూస్: రూ.5లకే ఇడ్లీ, పూరీ, వడ, ఉప్మా, పొంగల్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

ప్రివ్యూ చూస్తూ బ్రెయిన్ డెడ్‌తో చనిపోయిన దర్శకుడు

బెట్టింగ్ యాప్స్‌కు ప్రమోషన్: 29 మంది సినీ సెలబ్రిటీలు, కంపెనీలపై ఈడీ కేసులు

తర్వాతి కథనం
Show comments