Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాట్సన్ అర్థ శతకంతో తేరుకున్న ఆసీస్: 231/7

Webdunia
ఆదివారం, 19 అక్టోబరు 2008 (13:57 IST)
FileFILE
మొహాలీలో జరుగుతున్న భారత్-ఆసీస్ టెస్ట్ సీరీస్‌లో రెండో టస్టు మూడో రోజు ఆటలో ఆసీస్ త్వరత్వరగా మూడు వికెట్లు కోల్పోయినప్పటికీ మైఖేల్ హస్సీ, షేన్ వాట్సన్ అర్థశతకాలు సాధించడంతో ఫాలో ఆన్ ప్రమాదంనుంచి గట్టెక్కడానికి ఆసీస్ తన ఆశలను కాస్త నిలుపుకుంది.

ఇషాంత్ శర్మ, జహీర్ ఖాన్, అమిత్ మిశ్రా ప్రారంభంలో వడివడిగా వికెట్లు తీసి మిడిలార్డర్‌ను కుప్పగూల్చినప్పటికీ మొదట హస్సీ తర్వాత వాట్సన్ సాధించిన అర్థశతకాలతో ఆసీస్ కాస్త ఊపిరి పీల్చుకుంది. 119 బంతుల్లో టెస్టుల్లో మూడో అర్థ శతకం సాధించిన హస్సీ 54 పరుగుల స్కోరు వద్ద ఇషాంత్ బౌలింగ్‌లో ధోనీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

తర్వాత హర్భజన్ బౌలింగ్‌లో హాడిన్, మిశ్రా బౌలింగ్‌లో వైట్‌లు వరుసగా 9, 5 పరుగులకే వెనుదిరిగినా వాట్సన్, బ్రెట్‌లీల ప్రతిఘటనతో ఆసీస్ ఫాలో ఆన్ గండం గట్టెక్కే దిశగా సాగుతోంది.

లంచ్ విరాసమయానికి 7వికెట్లు కోల్పోయి 177 పరుగులు చేసి ఆశలు వదిలేసుకున్న ఆసీస్ ఈ ఇరువురు ఆటగాళ్ల ప్రతిభతో పుంజుకుని 231 పరుగులు చేయగలిగింది. 85 ఓవర్లు ముగిసేసరికి వాట్సన్ 58, బ్రెట్‌లీ 31 పరుగులతో క్రీజులో ఉన్నారు.

కాగా భారత్ బౌలర్లలో జహీర్ ఖాన్ 1, అమిత్ మిశ్రా 3, ఇషాంత్ 2, భజ్జీ 1 వికెట్టు పడగొట్టారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎస్వీ యూనివర్సిటీ మెస్‌.. భోజనంలో జెర్రీ కనిపించింది.. విద్యార్థులు షాక్

చిరుధాన్యాల పునరుద్ధరణ, పత్తి పునరుద్ధరణ: ఢిల్లీ కళా ప్రదర్శనలో తెలుగు రాష్ట్రాల నుండి సస్టైనబిలిటీ ఛాంపియన్లు

తెలంగాణలో కొత్త రేషన్ కార్డు దరఖాస్తు ప్రక్రియకు బ్రేక్.. ఎందుకంటే?

Delhi Elections: పన్ను మినహాయింపే కలిసొచ్చిందా..? బీజేపీపై విజయంపై పవన్ ప్రశంసలు

కిరణ్ రాయల్ చేసిన మోసంతో చనిపోతున్నా: సెల్ఫీ వీడియోలో మహిళ సంచలన ఆరోపణ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పుష్ప హిట్ క్రెడిట్ అంతా సుకుమార్‌దే, అల్లు అర్జున్‌లో ఎస్.వి. రంగారావ్ ఉన్నాడు

Viral Girl: మోనాలిసా భోస్లే తొలి సినిమా పారితోషికం ఎంతో తెలుసా?

కెమెరా టెక్నీషియన్ అసోసియేషన్స్ లో గొడవలు వైస్ ప్రెసిడెంట్ పై దాడి

అఖండ 2: తాండవం లో ఆది పినిశెట్టి- అన్నపూర్ణ 7 ఎకర్స్ లో ఫైట్ షూటింగ్

హీరోగా వెన్నెల కిషోర్ పేరుని బ్రహ్మానందం చెప్పినా రాజా గౌతమ్‌ను వరించింది

Show comments