Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాఖండేలో మాస్టర్ బ్లాస్టర్ వందో సెంచరీ సాధిస్తాడా!?

Webdunia
సోమవారం, 21 నవంబరు 2011 (15:46 IST)
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఖాతాలో ప్రపంచకప్‌ గెలుచుకునేందుకు వేదికైనా వాఖండే స్టేడియం మాస్టర్ వందో సెంచరీకి వేదికవుతుందా అనేది తెలియాలంటే.. విండీస్‌తో మంగళవారం ప్రారంభం కానున్న ఫైనల్ టెస్టు వరకు ఆగాల్సిందే.

అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో అరుదైన రికార్డులతో ఓ వెలుగు వెలుగుతున్న సచిన్ ఖాతాలో ప్రపంచకప్ రికార్డ్ వాఖండే స్టేడియంలోనే నమోదైంది. ఏప్రిల్ రెండో తేదీన జరిగిన ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ వాఖండే స్టేడియంలో జరిగిన సంగతి తెలిసిందే.

ఈ స్టేడియంలో భారత్ విజయకేతనం ఎగరవేయడం ద్వారా మాస్టర్ ఖాతాలో ప్రపంచకప్ కూడా తోడైంది. ఇదే స్టేడియంలో వెస్టిండీస్‌తో మంగళవారం నుంచి చివరిదైన మూడో టెస్టు ప్రారంభం కానుంది. ఈ స్టేడియం వేదికగా మాస్టర్ వందో సెంచరీ సాధిస్తాడని క్రికెట్ అభిమానులు సెంటిమెంట్‌గా ఫీలవుతున్నారు.

22 ఏళ్ల తర్వాత టీమిండియాకు వాఖండే వేదికగా ప్రపంచకప్ సాధించిన నేపథ్యంలో, విండీస్‌తో జరిగే చివరిటెస్టులోనూ మాస్టర్ వందో సెంచరీ రికార్డు నమోదయ్యే అవకాశం ఉందని యావత్తు క్రికెట్ ప్రపంచం ఆత్రుతతో ఎదురుచూస్తోంది.

ఇప్పటివరకు ఓవల్ మైదానంలో (ఇంగ్లండ్) 91, కోట్లాలో 76, ఈడెన్‌లో రెండు టెస్టు మ్యాచ్‌లాడినప్పటికీ మాస్టర్ వందో సెంచరీ సాధించలేకపోయాడు. అయితే వాఖండే స్టేడియంలో మాస్టర్ తప్పకుండా వందో శతకాన్ని నమోదుచేసుకుంటాడని అభిమానులు అంటున్నారు. మరి వందో సెంచరీ సాధించేందుకు తొందరెందుకు అన్న సచిన్ శతకాన్ని సాధిస్తాడో లేదో వేచి చూడాల్సిందే..!
అన్నీ చూడండి

తాజా వార్తలు

Maharashtra: ఫోన్ చూసుకుంటూ వచ్చిన తండ్రి.. నాలుగేళ్ల బాలుడిపై ఎక్కి దిగిన తండ్రి.. ఎక్కడ? (video)

195 ఎర్రచందనం దుంగల స్వాధీనం.. పోలీసులను అభినందించిన డిప్యూటీ సీఎం పవన్

తిరుమల నందకం అతిథి గృహంలో దంపతుల ఆత్మహత్య.. చీరతో ఉరేసుకుని?

ఫిబ్రవరి 24న ప్రారంభం కానున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు

అమెరికాలో తెలుగు విద్యార్థి ఆత్మహత్య... కారణాలేంటో?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చాలా కాలంగా మిస్ అయ్యాను, తండేల్ తో మళ్ళీ నాకు తిరిగివచ్చింది : అక్కినేని నాగచైతన్య

చిరంజీవి పేరు చెప్పడానికి కూడా ఇష్టపడని అల్లు అరవింద్

మాస్ ఎంటర్‌టైనర్‌ గా సందీప్ కిషన్ మజాకా డేట్ ఫిక్స్

బొమ్మరిల్లు బాస్కర్, సిద్ధు జొన్నలగడ్డ కాంబోలో వినోదాత్మకంగా జాక్ టీజర్

తెలంగాణ దర్శకుడు తనయుడు దినేష్‌మహీంద్ర దర్శకత్వంలో లవ్‌స్టోరీ

Show comments