Webdunia - Bharat's app for daily news and videos

Install App

మొహాలీ టెస్టు: భారత్ బ్యాటింగ్

Webdunia
మొహాలీలో శుక్రవారం ప్రారంభమైన రెండో టెస్టులో భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ప్రస్తుతం స్వదేశంలో భారత్ - ఇంగ్లండ్ జట్ల మధ్య రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ జరుగుతున్న విషయం తెల్సిందే. ఈ సిరీస్‌లో భాగంగా చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరిగిన తొలి టెస్టులో 'టీమ్ ఇండియా' ఘన విజయం సాధించింది. కాగా, రెండో టెస్టు మొహాలీలోని పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ మైదానంలో ప్రారంభమైంది.

క్రికెట్ మ్యాచ్ సందర్భంగా మొహాలీలో అత్యంత కట్టుదిట్టమైన భద్రతను కల్పించారు. ఈ మ్యాచ్ కోసం ప్రకటించిన తుది జట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. ఫామ్‌లో లేక తంటాలు పడుతున్న భారత సీనియర్ బ్యాట్స్‌మెన్ రాహుల్ ద్రావిడ్‌కు తుది జట్టులో చోటు కల్పించారు. అంతేకాకుండా బ్యాటింగ్ ఆర్డర్‌లో రాహుల్ స్థానాన్ని మార్పు చేయబోమని కెప్టెన్ ధోనీ స్పష్టం చేశారు. ఇరు జట్ల వివరాలు.

భారత్.. సెహ్వాగ్, గంభీర్, రాహుల్ ద్రావిడ్, టెండూల్కర్, లక్ష్మణ్, యువరాజ్ సింగ్, ధోనీ, హర్భజన్ సింగ్, అమిత్ మిశ్రా, జహీర్ ఖాన్, ఇషాంత్ శర్మ.

ఇంగ్లండ్.. కుక్, స్ట్రాస్, బెల్, పీటర్సన్, ఫ్లింటాఫ్, కాలింగ్‌వుడ్, ప్రియర్, స్వాన్, బ్రాడ్, ఆండర్సన్, పనేసర్.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Delhi Election Results 2025: జూనియర్ అరవింద్ కేజ్రీవాల్‌.. అచ్చం అలానే వున్నాడే (వీడియో వైరల్)

ఢిల్లీ అసెంబ్లీ ఫలితాలు, మ్యాజిక్ ఫిగర్ దాటేసిన భాజపా, 46 స్థానాల్లో ఆధిక్యం

విశాఖ సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం

తిరుమల నందకం గెస్ట్ హౌసులో దంపతులు ఆత్మహత్య

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి వైసీపీలో చేరా: శైలజానాథ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చాలా కాలంగా మిస్ అయ్యాను, తండేల్ తో మళ్ళీ నాకు తిరిగివచ్చింది : అక్కినేని నాగచైతన్య

చిరంజీవి పేరు చెప్పడానికి కూడా ఇష్టపడని అల్లు అరవింద్

మాస్ ఎంటర్‌టైనర్‌ గా సందీప్ కిషన్ మజాకా డేట్ ఫిక్స్

బొమ్మరిల్లు బాస్కర్, సిద్ధు జొన్నలగడ్డ కాంబోలో వినోదాత్మకంగా జాక్ టీజర్

తెలంగాణ దర్శకుడు తనయుడు దినేష్‌మహీంద్ర దర్శకత్వంలో లవ్‌స్టోరీ

Show comments